Posts

Showing posts with the label latest news

యుద్ధభేరి మోగించినట్టు సంకేతాలు…! | China started war on Taiwan

Image
యుద్ధభేరి మోగించినట్టు సంకేతాలు …! తైవాన్‌పై సైనిక చర్యకు చైనా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సరిహద్దులకు భారీ స్థాయిలో బలగాలను, ఆయుధాలను తరలించినట్లు సమాచారం. చైనా ప్రభుత్వం అత్యాధునిక డీఎఫ్-17 క్షిపణులను కూడా మోహరించింది. తైవాన్ తమ అంతర్భాగమేనని చెబుతున్న చైనా, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆ చిన్న భూభాగంపై యుద్ధభేరి మోగించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. మరింత కవ్వించే రీతిలో ఇటీవలే చైనాకు చెందిన 40 యుద్ధ విమనాలు తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. ఇటీవల గ్వాన్‌డాంగ్‌లోని సైనిక స్థావరాన్ని సందర్శించిన అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. సైనికులంతా తమ దృష్టిని యుద్ధ సన్నద్దతపైనే ఉంచాలని పిలుపునిచ్చారు. నిత్యం అప్రమ్తతంగా ఉండాలని ఆదేశించారు. సైనిక స్థావరాల విస్తరణ ,  జిన్‌పింగ్‌ ప్రకటన బట్టి చూస్తే తైవాన్‌పై చైనా దాడి చేసేందుకు సిద్ధమవుతోందన్న ఊహాగానాలకు బలం చేకూరుతుంది. చైనాతో యుద్ధానికి తైవాన్ సిద్ధంగా ఉండాలని అమెరికా రక్షణ వర్గాలు సూచించాయి. అయితే తైవాన్‌పై దాడి చేయడం చైనాకు అంత సులభమేమీ కాదని ,  చైనా తన సేనలను తైవాన్‌పైకి నడిపే ముందు ఓసారి అమెరికా వైఖరిని క...

నీళ్ళలో మునిగిన వాహనాల గతి ఏమిటి...! భీమా వర్తిస్తుందా...! #car insurance

Image
  నీళ్ళలో మునిగిన వాహనాల గతి ఏమిటి...! భీమా వర్తిస్తుందా...!   కురిసింది చిన్నవాన కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వరదలు నదుల్లా పొంగాయి. రోడ్డు మీదున్న కార్లు , లారీలు , బస్సులు కూడా కొట్టుకెళ్లిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోనైతే వాహనాలు కనిపించకుండా మునిగిపోయాయి. కొన్ని వాహనాలు చిన్న రిపేర్లతో బయటపడితే , మరికొన్ని వాహనాలకు మాత్రం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. దీంతో యజమానులు ఇన్సూరెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని , ఎంత వరకు కవరేజీ ఉన్నదో చూసుకున్నాకే దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  ' వాహనాల ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ దరఖాస్తులు క్రమంగా పెరుగుతున్నాయి. వరద పూర్తిగా తగ్గిపోయి , అన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ పూర్తైతే దరఖాస్తుల సంఖ్య ఇంకా ఎక్కువవుతుంది ' అని బజాజ్‌ అలియాంజ్‌ ఇన్సూరెన్స్‌ మోటర్‌ ఓడీ క్లెయిమ్స్‌ హెడ్‌ పద్మనాభ చెప్పారు. ఇంజిన్‌కు సైతం రక్షణ కల్పించే పాలసీని కట్టినవారికి మాత్రమే ఊరట కలుగుతుందని ఆయన చెప్పారు. ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ లేకున్నా , ఇత...

దుబ్బాకలో దూసుకుపోతున్న కత్తి కార్తికపై చీటింగ్ కేసు...!#kathi karthika

Image
యాంకర్ , దుబ్బాకలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆమెపై బాధితుడు ఫిర్యాదు చేశాడు. భూ వివాదంలో సెటిల్‌మెంట్ చేస్తానంటూ మోసం చేసినట్టు కత్తి కార్తీకపై ఆరోపణలు వచ్చాయి. అమీన్‌పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఓ ప్రైవేటు కంపెనీకి ఇప్పించేందుకు మధ్యవర్తిత్వం చేసినట్టు బాధితుడు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కార్తీక , అనుచరులు కోటి రూపాయలు డిపాజిట్ చేయించుకుందని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కత్తి కార్తీక , తన సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట ఇండిపెండెంట్ అభ్యర్థిగా దుబ్బాక ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి ఆ తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తనను గెలిపించాలని ఆమె కోరుతున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని. దుబ్బాక లో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు...

లద్దాఖ్‌ను కలిపే మరో సొరంగం రెడీ అవుతోంది...!

Image
లద్దాఖ్‌ను కలిపే మరో సొరంగం రెడీ అవుతోంది... ! హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి లద్దాఖ్‌కు ఏడాది పొడవునా ప్రయాణించేందుకు వీలుగా ఈ మధ్యనే అటల్‌ టన్నెల్‌ పూర్తయింది. రెండు ప్రాంతాల ప్రజల దశాబ్దాల నాటి కల నెరవేరింది. అయితే ఇప్పుడు అలాంటి మరో టన్నెల్‌నే నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దానిపేరే జోజిలా పాస్‌ టన్నెల్‌. శ్రనగర్‌ నుంచి లద్దాఖ్‌ వరకు ఈ సొరంగం నిర్మాణం జరగనుంది. దీని నిర్మాణం కోసం కూడా ఎన్నో ఏళ్లుగా స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ అనేక కారణాలతో దీని నిర్మాణం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు గురువారం ఈ టన్నెల్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.   జోజిలా పాస్‌ టన్నెల్‌ ద్వారా శ్రీనగర్‌-లద్దాఖ్‌ల మధ్య సంవత్సరం పొడవునా వాహనాల రాకపోకలకు అవకాశం ఏర్పడుతుంది.   అంతేకాకుండా వ్యాపార లావాదేవీలు జరిపేందుకు , కూలి పనులు చేసుకునేందుకు ఈ మార్గం ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే అటల్‌ టన్నెల్‌ నిర్మాణం తరువాత కేంద్రం జోజిలా టన్నెల్‌పై దృష్టి సారించింది. రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ టన్నెల్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. స్వయంగా మొదటి బ్లా...

వైసీపీలోకి నాదెండ్ల మనోహర్...!

Image
  ఇప్పటికే వరుస వరుసగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ లు మీద షాక్ లు తగులుతున్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు బీజేపి పవన్ తో పొత్తు తెగ తెంపులు చేసుకోకపోయినా , చేసుకున్నట్టుగానే వ్యవహరిస్తోంది. ఏ విషయంలోనూ కలుపుకుని వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో పవన్ ఒంటరిగా ముందుకు వెళ్ళలేక , ఇష్టం లేకపోయినా బీజేపి తోనే ముందుకు అడుగులు వేసేందుకు పవన్ సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా , జనసేన పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉంటూ వస్తున్న ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జి నాదెండ్ల మనోహర్ ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారనే వార్తలు పెద్దఎత్తున వస్తున్నాయి.   గత కొంతకాలంగా ఆయన జనసేన పార్టీలో ఇమడలేక పోతున్నారని , తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైసీపీతో అడుగులు వేస్తే ఫలితం ఉంటుందనే అభిప్రాయంతో , ఆ పార్టీ వైపు చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.   నాదెండ్ల మనోహర్ కు జనసేన పార్టీలో ప్రాధాన్యం ఎక్కువగానే ఉంటూ వస్తోంది. పవన్ ఏ పర్యటనకు వెళ్లినా , పక్కన నాదెండ్ల ఉంటారు. పవన్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా , దాంట్లో ఆయన పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. అంతగా ఆయనకు ఆ పార...

వీళ్ళెం అమ్మానాన్నలు, కన్న కొడుకుని అమ్ముకుని...!

Image
వీళ్ళెం అమ్మానాన్నలు, కన్న కొడుకుని అమ్ముకుని...! దంపతుల మధ్య వచ్చిన గొడవల కారణంగా కన్నకొడుకునే అమ్ముకుని , ఇద్దరూ వేరు పడి వెళ్లిపోయిన అమానవీయ ఘటన ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా మథిలి మండలం కియాంగ్‌ పంచాయతీ తేలగబేచా గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. అదే గ్రామానికి చెందిన వాసుదేవ్‌ అనే తొమ్మిదేళ్ల బాలుడి తల్లిదండ్రులు రోజూ గొడవలు పడుతుండేవారు. ఇక తమ మధ్య సయోధ్య కుదరదని , విడిపోయి చెరో దారి చూసుకోవాలని నిర్ణయించుకుని, వారి తొమ్మిదేళ్ల బాలుడు వాసుదేవ్‌ను ఓ కుటుంబానికి అమ్మేసి వెళ్లిపోయారు. బాలుడిని కొనుకున్న యజమాని వాసుదేవ్‌ను పశువుల కాపలాకు పంపించేవాడు.   వెళ్లలేనంటే కొడుతుండేవారు. భోజనం కూడా అప్పుడప్పుడే. చిత్రహింసలు మితిమీరడంతో భరించలేకపోయిన బాలుడు అక్కడ నుంచి తప్పించుకుని సలపదర్‌ అనే గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ కొంతమంది గ్రామస్థులు వాసుదేవ్‌ పరిస్థితి చూసి అంగన్‌వాడీ కేంద్రానికి అప్పగించారు. బాలుడి నేపథ్యం తెలుసుకున్న అంగన్‌వాడీ కార్యకర్త జయంతి ఖోరా, వాసుదేవ్‌ని ఇంటికి తీసుకెళ్లి సంరక్షిస్తోంది. బాలుడిని కొన్న వ్యక్తి నుంచి జయంతికి బెదిరింపులు వచ్చినా గ్రామస్థుల సహకారంతో ...

గ్రీన్, అల్లం టీ మాటలు విన్న ప్రజలు కొత్తగా తందూరు చాయ్ తయారుకావడంతో…!

Image
  గ్రీన్ , అల్లం టీ మాటలు విన్న ప్రజలు కొత్తగా తందూరు చాయ్ తయారుకావడంతో …!   కరోనా ఉద్యోగాన్ని కాటేసింది. దీంతో లక్షల రూపాయల ఉద్యోగాన్ని కోల్పోయాడు ఆ యువకుడు. కానీ అత్మవిశ్వాశాన్ని కోల్పోలేదు. ఉద్యోగం పోయిందనే నిరాశతో ఇంట్లో కూర్చోలేదు. తన ఆలోచనలకు పదునుపెట్టాడు. అందరికంటే భిన్నంగా ఆలోచించి తందూరీ చాయ్‌ను తయారు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఇప్పుడు ఆ చాయ్‌కి యమగిరాకీ పెరిగింది. అలాంటి అద్భుతమైన తందూరి చాయ్ తాగడానికి ప్రజలు క్యూ కడుతున్నారు. అందరినీ ఆకట్టుకుంటున్న తందూరి చాయ్‌పై స్పెషల్ స్టోరీ.   నిర్మల్ జిల్లా చించోలిబి గ్రామానికి చెందిన కోంతం గంగాధర్. అందరిలానే కరోనా దెబ్బకు నష్టపోయిన వారిలో ఇతను ఒకడు. కరోనా రాకముందే దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ఉద్యోగం చేస్తుండేవాడు.   అయితే అంతకు మించి ప్రసిద్ధి చెందిన ఇటలీలోని ఓ హోటల్‌లో ఉద్యోగానికి గంగాధర్ సెలక్ట్‌ అయ్యాడు. నెలకు రెండు లక్షల జీతం. దీంతో ఇటలీ వెళ్దామని భావించి దుబాయిలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి చేరాడు. అయితే ఇంటికి రాగానే కరోనా విజృంభించింది. పైగా ఇటలీలో ఈ మహమ్మారి వేల మందిని బలి తీసుకుంది. ఇటలీకి ...

స్వీట్లకూ ఎక్స్‌పైరీ డేట్‌ ఉండాల్సిందే…!

Image
  స్వీట్లకూ ఎక్స్‌పైరీ డేట్‌ ఉండాల్సిందే … !   కొవిడ్‌- 19 మహమ్మారి నేపథ్యంలో పరిశుభ్రత , ఆహార భద్రతపై శ్రద్ధ పెరిగింది. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్న స్పృహవచ్చింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కొత్త నిబంధనలతో ముందుకొచ్చింది. ప్యాకేజీ లేని వస్తువులు , లూస్‌ స్వీట్లకు కూడా ఎక్స్‌పైరీ డేట్‌ పేర్కొనాల్సిందేనని వ్యాపారులను ఆదేశించింది.   నేటి నుంచి (అక్టోబర్‌ 1) ఉత్తర్వులు అమలు చేయాలని స్వీట్‌షాప్‌ యజమానులకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. అన్ని ప్యాకేజీ లేని వస్తువులు , లూస్‌ స్వీట్లు , వాటిని తీసుకెళ్లే ట్రేలు , కంటైనర్లపై ఉత్పత్తి తయారీ తేదీ , గడువు తేదీ పేర్కొనడం తప్పనిసరి.   దీపావళి , దసరా సీజన్‌లో స్వీట్లు , ఇతర ఆహార ఉత్పత్తులు ఎక్కువగా అమ్ముడుపోతాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. అలాగే , పాలు , పాల ఉత్పత్తులను తయారు చేసిన రెండు రోజులలోపు వాడేయాలని పేర్కొంది. లడ్డూలు , కోవాలాంటి స్వీట్లను నాలుగు రోజుల వరకు ఉంచవచ్చని తెలిపింది. వీట...

చైనాతో మరోమారు యుద్ధం తప్పదా…!

Image
చైనాతో మరోమారు యుద్ధం తప్పదా …!   సరిహద్దు సమస్య చర్చల ద్వారా పరిష్కారం అయ్యే సూచనలు కనుచూపుమేరలో కనిపించని నేపథ్యంలో చైనా భారత్ పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతున్న సూచనలు కనబడుతున్నాయి. అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణులతో సహా భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించి పలు క్షిపణులను భారత్ చైనాతో సరిహద్దుల్లో మోహరించింది. దీనికి ప్రతిగా చైనా కూడా రెండు వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను మోహరించింది. రెండుదేశాల సన్నాహకాలను చూస్తుంటే సమీప భవిష్యత్తులో ఇరుదేశాలూ యుద్దానికి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోందని రక్షణరంగ నిపుణులు పేర్కొంటున్నారు. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా భారత్ , చైనాలు తమ తమ సరిహద్దుల రక్షణ కోసం , ప్రత్యర్థి దేశంపై దాడి కోసం ఆధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నాయి.  2 వేల కి.మీల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను , భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను జిన్‌జియాంగ్ , టిబెట్‌ ప్రాంతాల్లో చైనా మోహరించింది. ప్రతిగా బ్రహ్మోస్ , నిర్భయ్ , భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల ఆకాశ్‌ క్షిపణులను భారత్‌ సిద్ధం చేసింది.   భారత్ సేకరించిన క్షిప...

పూరీ ఆలయంలో ఇలా జరిగిందేంటి...?

Image
  పూరీ ఆలయంలో ఇ లా జరిగిందేంటి... ?   ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో పనిచేస్తున్న 400 మందికి పైగా సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఒడిశా ప్రభుత్వ అధికారులు సోమవారం స్పష్టం చేశారు. పూరీ శిరిమందిరాన్ని తిరిగి భక్తుల సందర్శన కోసం తెరవాలని డిమాండ్లు వినిపిస్తున్న సమయంలో... అధికారులు ఈ విషయం బయటపెట్టారు. " 400 మందిలో 9 మంది కరోనా వైరస్ వల్ల చనిపోయారు. 16 మందికి భువనేశ్వర్‌లోని కోవిడ్ 19 ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతోంది" అని శ్రీ జగన్నాథ ఆలయ పర్యవేక్షణ , పాలన అధికారి అజయ్ కుమార్ జెనా తెలిపారు. కరోనా సోకిన చాలా మంది ఆలయ సిబ్బంది ఇళ్ల దగ్గరే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఆయన వివరించారు. అందువల్ల ఆలయాన్ని తెరిచేందుకు , భక్తులను అనుమతించేందుకు సిబ్బంది కొరత ఉందన్నారు.   ప్రస్తుతం పూరీ ఆలయం భక్తుల కోసం తెరవకపోయినా... రోజువారీ పూజలు జరుగుతున్నాయి. ఆలయ పూజారులు మాత్రం... నవంబర్ చివరి వరకూ ఆలయంలోకి భక్తులను అనుమతించకపోవడం మేలంటున్నారు. తమ వర్గానికి చెందిన వారికే ఎక్కువగా కరోనా సోకుతోందని అభ్యంతరం చెబుతున్నారు. ఇదే విషయాన్ని రిపోర్టు రూపంలో హైకోర్టుకు సమర్పించింద...

బిగబాస్: ఈ వారం నామినేషన్‌లో ఆ ఏడుగురు

Image
బిగబాస్: ఈ వారం నామినేషన్‌లో ఆ ఏడుగురు సోమవారం వస్తే ఎలిమినేషన్‌కు సంబంధించి నామినేషన్ ప్రక్రియ జరగడం కామన్. ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఏడుగురు సభ్యులు ఉండగా , వారిలో ఎవరు ఇంటిని వీడనున్నారనేది ఆసక్తిగా మారింది. సోమవారం ఎసిపోడ్ గోంగూర తోట కాడ కాపుకాశా అనే పాటతో మొదలైంది. ఆ తర్వాత మార్నింగ్ మస్తీలో భాగంగా స్వాతీ దీక్షిత్ మిగతా ఇంటి సభ్యులకు నవరసరాలు నేర్పించింది. శంగార రసం అభిజిత్‌తో చేయగా , విషాదం నోయల్‌తో చేసింది. తండ్రి పాత్రని నోయల్ పోషించగా , ఆయన చనిపోయిన క్రమంలో స్వాతి వెక్కి వెక్కి ఏడ్చింది. అది చూసి మోనాల్ కూడా కంట కన్నీరు పెట్టుకుంది.   భీభత్సం, రసం పండించేందుకు నోయల్‌-లాస్య రంగంలోకి దిగారు. వీరిద్దరు నటనకు అంతా ఫిదా అయ్యారు.   గట్టిగా గట్టిగా అరుస్తూ తమ తమ పాత్రలలో తెగ జీవించేశారు. ఇక ఆ తర్వాత దివి నామినేషన్ విషయంలో మెహబూబ్ తో పాటు అభిజిత్‌తో చర్చించింది. అనంతరం అవినాష్‌... అరియానాతో రొమాంటిక్ చర్చలు జరపగా , ఆ తర్వాత మోనాల్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కొంత సేపు హాస్యం పండించి అందరిని నవ్వించాడు.   ఇక బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టగా ఇం...

పాకిస్థాన్‌ మంగళవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది.

Image
  పాకిస్థాన్‌ మంగళవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. పాకిస్థాన్‌ మంగళవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. పూంచ్‌ జిల్లా మాన్‌కోట్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట కాల్పులకు పాల్పడింది. దాయాదీ సైనికులు చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపి , మోర్టార్లతో షెల్లింగ్స్‌ చేశారని రక్షణశాఖ ప్రజాసంబంధాల అధికారి ఒకరు తెలిపారు. భారత జవాన్లు ధీటుగా స్పందించడంతో వెనక్కు తగ్గారని పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వెంట నిత్యం ఏదో ఒకచోట పాక్‌ కాల్పులకు తెగబడుతూ తన వక్రబుద్ధి ప్రదర్శిస్తూనే ఉంది. కొంతకాలంగా పూంచ్‌ , రాజౌరీ జిల్లాల్లో భారత పౌరులు , సైనిక పోస్టులే లక్ష్యంగా పాక్ సైనికులు గుళ్లవర్షం కురిపిస్తున్నారు. అటు , ఉత్తర కశ్మీర్‌ బారాముల్లా జిల్లా రామ్‌పూర్ సెక్టార్‌లోనూ ఇటీవల పాక్‌ సైన్యం కాల్పులు జరపగా భారత్ ధీటుగా బదులిచ్చింది.