పాకిస్థాన్ మంగళవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది.
పాకిస్థాన్ మంగళవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. పాకిస్థాన్ మంగళవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. పూంచ్ జిల్లా మాన్‌కోట్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట కాల్పులకు పాల్పడింది. దాయాదీ సైనికులు చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపి , మోర్టార్లతో షెల్లింగ్స్ చేశారని రక్షణశాఖ ప్రజాసంబంధాల అధికారి ఒకరు తెలిపారు. భారత జవాన్లు ధీటుగా స్పందించడంతో వెనక్కు తగ్గారని పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వెంట నిత్యం ఏదో ఒకచోట పాక్ కాల్పులకు తెగబడుతూ తన వక్రబుద్ధి ప్రదర్శిస్తూనే ఉంది. కొంతకాలంగా పూంచ్ , రాజౌరీ జిల్లాల్లో భారత పౌరులు , సైనిక పోస్టులే లక్ష్యంగా పాక్ సైనికులు గుళ్లవర్షం కురిపిస్తున్నారు. అటు , ఉత్తర కశ్మీర్ బారాముల్లా జిల్లా రామ్‌పూర్ సెక్టార్‌లోనూ ఇటీవల పాక్ సైన్యం కాల్పులు జరపగా భారత్ ధీటుగా బదులిచ్చింది.