Posts

Showing posts with the label google

గూగుల్ భవిష్యత్తులో విడుదల చేసే మోడళ్లలో ఈ సరికొత్త 'హోల్డ్ ఫర్ మీ’

Image
  గూగుల్ భవిష్యత్తులో విడుదల చేసే మోడళ్లలో ఈ సరికొత్త ' హోల్డ్ ఫర్ మీ ’   సాంకేతికత ఇంతలా అభివృద్ధి చెందని కొత్తలో , మనకు ఎలాంటి సాయం కావాలన్నా సంస్థల టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసేవాళ్లం. మనకు అవసరమైన సమాచారాన్ని ఆయా సంస్థల కస్టమర్ ఏజెంట్లు అందించే వరకు మన కాల్‌ను చాలా సేపు హోల్డ్‌లో పెట్టేవారు. సెల్‌ఫోన్ నెట్‌వర్క్ కంపెనీల కస్టమర్ కేర్ సెంటర్లకు కాల్ చేస్తే గంటల కొద్దీ కాల్ హోల్డ్‌లో పెట్టేవారు. ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు లేకుండా గూగుల్ కొత్త కాల్ అప్‌డేట్‌ను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఇప్పుడు కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ కాల్స్‌ను గూగుల్ సాయంలో మనం కూడా హోల్డ్‌లో పెట్టొచ్చు. గూగుల్ భవిష్యత్తులో విడుదల చేసే మోడళ్లలో ఈ సరికొత్త ' హోల్డ్ ఫర్ మీ ' ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది.   కస్టమర్ సపోర్ట్ ప్రతినిధి స్పందన కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా , వినియోగదారుల సమయం వృథా కాకుండా గూగుల్‌ ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేసింది. అమెరికాలో గూగుల్ విడుదల చేసిన పిక్సెల్ 5, పిక్సెల్ 4 ఎ 5 జి స్మార్ట్‌ఫోన్‌ల కోసం ' హోల్డ్ ఫర్ మీ ' ప్రివ్యూ ఫీచర్‌ను ప్రకటించింది. దీని పనితీరు గుర

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో కొత్త విధానం.. గూగుల్ ప్లాన్‌..

Image
కరోనా దెబ్బతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతే, కోట్లాది మంది ఉపాధిపై దెబ్బ పడింది. లాక్ డౌన్లు ముగిసి అన్‌లాక్‌లోకి అడుగుపెట్టి, అన్నింటికీ అనుమతులు ఇస్తున్నా, ఇంకా వ్యాపారాలు పూర్తిస్థాయిలో సాగడంలేదు. ఇక, ఈ సమయంలో చాలా సంస్థలు వర్క్‌ ఫ్రమ్ హోమ్‌కి మొగ్గు చూపాయి. కొన్ని సంస్థలు ఈ ఏడాది మొత్తం వర్క్‌ఫ్రమ్‌ హోం ప్రకటించాయి. మరోవైపు, గూగుల్ ఉద్యోగులు భవిష్యత్తులో హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ తరహాలో పనిచేయనున్నట్టు తెలిపారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. ఉద్యోగులకు ఆఫీసు సదుపాయాలు ఏర్పాటు చేయడం సహా దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే పలు అవకాశాలపై కసరత్తు చేస్తున్నట్టు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుందర్ పిచాయ్, తాము అంతర్గతంగా నిర్వహించిన ఓ సర్వేలో 62 శాతం మంది ఉద్యోగులు తిరిగి ఆఫీసుకు వచ్చి విధులు నిర్వహించడానికి మొగ్గు చూపుతున్నారని, కానీ, ప్రతిరోజూ వచ్చేందుకు మాత్రం ఇష్టంగా లేరని ఆ సర్వే నివేదిక చెబుతోందన్నారు. అయితు, భవిష్యత్తులో మరింత సులభతరమైన పని విధానాలు అందుబాటులో వస్తాయని భావిస్తున్నామన్న ఆయన, వ్యక్తిగతంగా లేదా గ్రూపుగా క్లిష్టమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు అందరి ప్రయోజన