Posts

Showing posts with the label traditional

ఈ రోజు నుండి దేవి 'త్రిరాత్ర' వ్రతం ప్రారంభం | Tri ratra vratham starts

Image
ఈ రోజు నుండి దేవి ' త్రిరాత్ర ' వ్రతం ప్రారంభం వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం నవరూప ధరాం శక్తిం , నవదుర్గాముపాశ్రయే జగజ్జనని అయిన అమ్మవారి దయతోనే సర్వ జగత్తూ నడయాడుతోంది. ఆ అమ్మ కరుణా పారీణ. ఆ తల్లి అమృతహృదయ. ఆమె చల్లని చూపులకోసం అఖిలాండాలు ఎదురు చూస్తుంటాయ. అందుకే ఆరాధించడానికి తిథి వార నక్షత్రాలు లేకపోయినా ఈ ఆశ్వీయుజమాసాన వచ్చే శుద్ధ పాడమి మొదలుకుని నవమి వరకు ఆ తల్లిని కొలిచినవారికి కోటిజన్మలలోని పాపరాశి భస్మమవడమే కాదు తుదిలేని పుణ్యరాశి లభ్యవౌతుందట. అందుకే సజ్జను లందరూ ఈ జగాలనేలే జగన్మాత వ్రతాన్ని ఆచరించడానికి వేయ్యి కనులతో ఎదురు చూస్తుంటారని , అలా చూసి అమ్మ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయని దేవీభాగవతం చెబుతోంది. ఈ వ్రతరాజాన్నే దుర్గాదేవి వ్రతమని , కుమారీ పూజ అనీ అంటారు. ఈ చల్లని తల్లిని మనలోని తిమిరాంధకారాన్ని పారద్రోలమని రాత్రివే

బతుకమ్మ పండుగ కథ​​​​​​​ Story of Bathukamma festival

Image
బతుకమ్మ పండుగ కథ​​​​​​​   వివరణ :  డా .  యం .  ఎన్ .  చార్య ,  ప్రముఖ   అంతర్జాతీయ   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   శాస్త్ర   పండితులు ,   శ్రీమన్నారాయణ   ఉపాసకులు ,  సునంద   రాజన్   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   కేంద్రం .  తార్నాక ,  హైదరాబాద్ .  ఫోన్ : 9440611151   రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో బతుకమ్మను పేర్చి అలంకరించి స్త్రీలు ,  యువతులు అందమైన వస్త్రాలు ధరించి రంగు రంగుల గాజులను చేతికి ధరించి బతుకమ్మ చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయాకారంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ ,  సద్దుల బతుకమ్మ. ఇలా దేని ప్రత్యేకత దానిదే. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను చెరువులో లేదా నీటి నదీ ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.   బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు ,  ప్రేమ ,  స్నేహం ,  బంధుత్వం ,  ఆప్యాయతలు ,  భక్తి ,  భయం ,  చరిత్ర ,  పురాణాలు మేళవిస్తారు. బతుకమ్మ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి ,  సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ ,  తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా