Posts

Showing posts with the label health

వాస్తు ప్రకారం ఈ దిశవైపు ఎత్తుగా ఉంటే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యం తప్పదట…!

Image
  వాస్తు ప్రకారం ఈ దిశవైపు ఎత్తుగా ఉంటే స్థిరాస్తుల అమ్మకం , అనారోగ్యం తప్పదట…! ఇల్లు నిర్మిస్తున్నాం అనుకోగానే వాస్తు పట్టించుకునేవారంతా ముందుగా గమనించేది దిక్కులు. ఏ దిక్కున ఏం ఉండాలని ముందుగానే ప్లాన్ వేసుకుంటారు. ఎందుకంటే మనకున్న ఎనిమిది దిక్కుల్లో ఒక్కో దిక్కుకి ఒక్కో దేవత అధిపతి. వారు శాంతించేలా ఇంటి నిర్మాణం ఉండేలా చూసుకుంటే అంతా శుభమే. మరి ఏ దిక్కున ఏం నిర్మించాలి , ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. తూర్పు : తూర్పు దిక్కును ఇంద్రుడు పాలిస్తుంటాడు. ఇంద్రుడు సంతానం, ఐశ్వర్యాలను కలిగిస్తాడని ప్రతీతి. అందుకే తూర్పు భాగంలో ఎక్కువ బరువు పెట్టడం మంచిది కాదు. అందుకే ఈ దిక్కున ఖాళీ స్థలంలో బావులు, బోర్లు నిర్మిస్తే శుభం. పడమర : పడమర దిక్కుకు అధిష్టాన దేవత వరుణడు. గృహ నిర్మాణ సమయంలో తూర్పు వైపు కన్నా పడమటి వైపు తక్కువ స్థలం విడిచిపెట్టాలి, ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఈ భాగంలో కూడా మంచినీటి బావులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్తరం : ఈ దిక్కుకు అధిష్టాన దేవత కుబేరుడు. దక్షిణ దిక్కుకంటే పల్లంగా విశాలంగా ఉండేలా చూసుకోవాలి. ఈ దిక్కున కూడా బోరు తవ్వించవచ్చు.ఈ జాగ్రత్తలు తీసుకుంటే విద్య, ఆదాయం, సం

The best treatment for Mental Health | పిచ్చికి – మానసిక రుగ్మతకు తేడా ఏ...

Image

ఫిబ్రవరికల్లా సగం జనాభాకు కరోనా...! | Corona to half the population by February

  ఫిబ్రవరికల్లా సగం జనాభాకు కరోనా ...! భారత జనాభాలో కనీసం సగం మందికి వచ్చే ఫిబ్రవరి నాటికి కరోనా సోకే ప్రమాదముందని కరోనా వైరస్ ‌ అంచనాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల్లో ఒకరైన అగ్రవాల్ ‌ వెల్లడించారు . ఇప్పటి వరకు దేశంలో 75 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి . పాజిటివ్ ‌ కేసుల సంఖ్యలో అమెరికా తర్వాతి స్థానం భారత్ ‌ దే . సెప్టెంబర్ ‌ మధ్య నాటికి అత్యధిక స్థాయికి చేరిన కరోనా వ్యాప్తి ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందని , సగటున రోజూ 61,390 కొత్త కేసులు నమోదౌతు న్నాయని తెలిపారు . మేం అనుసరించిన మోడల్ ‌ అంచనాల ప్రకారం దేశ జనాభాలో ఇప్పుడు దాదాపు 30 శాతం జనాభా కరోనా బారిన పడ్డారు , ఇది ఫిబ్రవరి నాటికి 50 శాతానికి చేరవచ్చు ’ అని ప్రభుత్వ కమిటీ సభ్యులు , కాన్పూర్ ‌ ఐఐటికి చెందిన మణీంద్ర అగ్రవాల్ ‌ తెలిపారు . కేంద్ర ప్రభుత్వ సీరోలాజికల్ ‌ సర్వేలతో పోల్చుకుంటే కరోనా వ్యాప్తి అధికంగా ఉందని ఈ కమిటీ అంచనా వేసింది . అతి తక్కువ జనాభాతో సర్వే చేయడంతో , సీరోలాజికల్ ‌ అంచనాలు వాస్తవాలకు దగ్గరగా లేవని అగ్రవాల్ ‌ తెలిపారు