వారఫలితాలు: తేదీ 23 అక్టోబర్ శుక్రవారం నుండి 29 గురువారం 2020 వరకు | #Weekly Astrology October 2020
వారఫలితాలు: తేదీ 23 అక్టోబర్ శుక్రవారం నుండి 29 గురువారం 2020 వరకు వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 మేషరాశి ( Aries) అశ్విని , భరణి , కృత్తిక 1 వ పాదం వారికి: ఈ వారం వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రావచ్చు. పారిశ్రామిక వర్గాలకు శ్రమకు తగిన ఫలితం దక్కే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పనులు నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్నా అవసరాలకు ఇబ్బంది ఉండదు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి . అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి , పశు , పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 ప...