పూరీ ఆలయంలో ఇలా జరిగిందేంటి...?

 పూరీ ఆలయంలో లా జరిగిందేంటి...?

 


ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో పనిచేస్తున్న 400 మందికి పైగా సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఒడిశా ప్రభుత్వ అధికారులు సోమవారం స్పష్టం చేశారు. పూరీ శిరిమందిరాన్ని తిరిగి భక్తుల సందర్శన కోసం తెరవాలని డిమాండ్లు వినిపిస్తున్న సమయంలో... అధికారులు ఈ విషయం బయటపెట్టారు. "400 మందిలో 9 మంది కరోనా వైరస్ వల్ల చనిపోయారు. 16 మందికి భువనేశ్వర్‌లోని కోవిడ్ 19 ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతోంది" అని శ్రీ జగన్నాథ ఆలయ పర్యవేక్షణ, పాలన అధికారి అజయ్ కుమార్ జెనా తెలిపారు. కరోనా సోకిన చాలా మంది ఆలయ సిబ్బంది ఇళ్ల దగ్గరే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఆయన వివరించారు. అందువల్ల ఆలయాన్ని తెరిచేందుకు, భక్తులను అనుమతించేందుకు సిబ్బంది కొరత ఉందన్నారు. ప్రస్తుతం పూరీ ఆలయం భక్తుల కోసం తెరవకపోయినా... రోజువారీ పూజలు జరుగుతున్నాయి. ఆలయ పూజారులు మాత్రం... నవంబర్ చివరి వరకూ ఆలయంలోకి భక్తులను అనుమతించకపోవడం మేలంటున్నారు. తమ వర్గానికి చెందిన వారికే ఎక్కువగా కరోనా సోకుతోందని అభ్యంతరం చెబుతున్నారు. ఇదే విషయాన్ని రిపోర్టు రూపంలో హైకోర్టుకు సమర్పించింది ఒడిశా ప్రభుత్వం. మొత్తం 822 మంది ఆలయ సిబ్బందికి కరోనా టెస్టులు జరిపినట్లు తెలిపింది. ఆలయాన్ని భక్తుల కోసం తెరిస్తే... పూజారులు, సిబ్బంది, వారి కుటుంబాలు సహా... మొత్తం 2200 మందిపై కరోనా ప్రభావం పడుతుందని అజయ్ కుమార్ వివరించారు.ఒడిశా పాలకులకు, ప్రజా ప్రతినిధులకు కూడా కరోనా సోకుతోంది. డిప్యూటీ స్పీకర్, మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చింది. మంగళవారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభించాలని అనుకోగా... సోమవారం జరిపిన టెస్టుల్లో 12 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. వీరిలో మంత్రులు సమీర్ దాష్, పద్మినీ దయన్, జ్యోతి పాణిగ్రాహికి... రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. తనకు కరోనా వచ్చినట్లు ట్విట్టర్లో తెలిపిన డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్... తనను ఈమధ్య కలిసిన వాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని కోరారు. తాను భువనేశ్వర్‌లో SUM కోవిడ్ ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు.

 

పూరీ జిల్లా ఎమ్మెల్యే ఉమాకాంత సమంత్రాయ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పి... తనను కలిసిన వాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని కోరారు. వర్షాకాల సమావేశాల దృష్ట్యా ఎమ్మెల్యేలతోపాటూ, జర్నలిస్టులు, అసెంబ్లీ సిబ్బంది, మంత్రిత్వ శాఖల సిబ్బందికి కూడా టెస్టులు చేశారు. కొంత మంది రిపోర్టులు మంగళవారం వస్తాయి.

ప్రస్తుతం ఒడిశాలో 35006 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ కరోనాతో 797 మంది చనిపోయారు.

Comments

Popular posts from this blog

హుస్సేన్ సాగర్‌లోని బుద్దుడి విగ్రహం ఠీవికి వన్నె తెచ్చే...!