Posts

Showing posts with the label expire date

స్వీట్లకూ ఎక్స్‌పైరీ డేట్‌ ఉండాల్సిందే…!

Image
  స్వీట్లకూ ఎక్స్‌పైరీ డేట్‌ ఉండాల్సిందే … !   కొవిడ్‌- 19 మహమ్మారి నేపథ్యంలో పరిశుభ్రత , ఆహార భద్రతపై శ్రద్ధ పెరిగింది. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్న స్పృహవచ్చింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కొత్త నిబంధనలతో ముందుకొచ్చింది. ప్యాకేజీ లేని వస్తువులు , లూస్‌ స్వీట్లకు కూడా ఎక్స్‌పైరీ డేట్‌ పేర్కొనాల్సిందేనని వ్యాపారులను ఆదేశించింది.   నేటి నుంచి (అక్టోబర్‌ 1) ఉత్తర్వులు అమలు చేయాలని స్వీట్‌షాప్‌ యజమానులకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. అన్ని ప్యాకేజీ లేని వస్తువులు , లూస్‌ స్వీట్లు , వాటిని తీసుకెళ్లే ట్రేలు , కంటైనర్లపై ఉత్పత్తి తయారీ తేదీ , గడువు తేదీ పేర్కొనడం తప్పనిసరి.   దీపావళి , దసరా సీజన్‌లో స్వీట్లు , ఇతర ఆహార ఉత్పత్తులు ఎక్కువగా అమ్ముడుపోతాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. అలాగే , పాలు , పాల ఉత్పత్తులను తయారు చేసిన రెండు రోజులలోపు వాడేయాలని పేర్కొంది. లడ్డూలు , కోవాలాంటి స్వీట్లను నాలుగు రోజుల వరకు ఉంచవచ్చని తెలిపింది. వీటి తయారీకి వాడే ఎడిబ