యుద్ధభేరి మోగించినట్టు సంకేతాలు…! | China started war on Taiwan

యుద్ధభేరి మోగించినట్టు సంకేతాలు…!



తైవాన్‌పై సైనిక చర్యకు చైనా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సరిహద్దులకు భారీ స్థాయిలో బలగాలను, ఆయుధాలను తరలించినట్లు సమాచారం. చైనా ప్రభుత్వం అత్యాధునిక డీఎఫ్-17 క్షిపణులను కూడా మోహరించింది. తైవాన్ తమ అంతర్భాగమేనని చెబుతున్న చైనా, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆ చిన్న భూభాగంపై యుద్ధభేరి మోగించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. మరింత కవ్వించే రీతిలో ఇటీవలే చైనాకు చెందిన 40 యుద్ధ విమనాలు తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి.


ఇటీవల గ్వాన్‌డాంగ్‌లోని సైనిక స్థావరాన్ని సందర్శించిన అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. సైనికులంతా తమ దృష్టిని యుద్ధ సన్నద్దతపైనే ఉంచాలని పిలుపునిచ్చారు. నిత్యం అప్రమ్తతంగా ఉండాలని ఆదేశించారు. సైనిక స్థావరాల విస్తరణజిన్‌పింగ్‌ ప్రకటన బట్టి చూస్తే తైవాన్‌పై చైనా దాడి చేసేందుకు సిద్ధమవుతోందన్న ఊహాగానాలకు బలం చేకూరుతుంది. చైనాతో యుద్ధానికి తైవాన్ సిద్ధంగా ఉండాలని అమెరికా రక్షణ వర్గాలు సూచించాయి. అయితే తైవాన్‌పై దాడి చేయడం చైనాకు అంత సులభమేమీ కాదనిచైనా తన సేనలను తైవాన్‌పైకి నడిపే ముందు ఓసారి అమెరికా వైఖరిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి.


ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకుందంటే చైనా చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి. తైవాన్ విషయంలో చైనా చర్యలను చాన్నాళ్లుగా గమనిస్తున్న అమెరికా దక్షిణ చైనా సముద్రంలో తన యుద్ధనౌకలను మోహరించి తైవాన్‌కు తానున్నాననే భరోసా కల్పిస్తోంది. అంతేకాదుతైవాన్‌కు భారీగా ఆయుధ సంపత్తిని అందిస్తోంది.

Comments