Posts

Showing posts with the label date

2020 సంవత్సరంలో దసరా పండగ ఎప్పుడు…! | Vijaya Dashami in 2020

Image
2020 సంవత్సరంలో దసరా పండగ ఎప్పుడు …! వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 విజయదశమి అంటే ఆరోజు సూర్యోదయానికి శ్రవణ నక్షత్రం ఉండాలి. శ్రవణ నక్షత్రానికి అధిదేవత విష్ణువు. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది. శమీ చెట్టు యొక్క పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజా స్థలంలో , ధన స్థానంలో నగదు గల్ల పెట్టెల్లో పెట్టుకుంటారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది. నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు , తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక