ఆరో రోజు అలిగిన బతుకమ్మ...! | Aligina bathukamma today
ఆరో రోజు అలిగిన బతుకమ్మ...! వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 ఆరో రోజు ' అలిగిన బతుకమ్మ ' ఎందుకంటే …? బతుకమ్మ పండుగలో ఆరో రోజును ' అలిగిన బతుకమ్మ ' అంటారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు. అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ పండుగ. ఆడపడచుల పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9 వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఐదురోజుల బతుకమ్మ వేడుకల్లో ఎంగిలిపువ్వు బతుకమ్మ , అటుకల బతుకమ్మ , ముద్దపప్పు బతుకమ్మ , నానబియ్యం బతుకమ్మ , అట్ల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఇక బతుకమ్మ పండుగలో ఆరో