Posts

Showing posts with the label ayurvedam

కరోనా చికిత్స: ఆయుర్వేదంతో అద్భుతమైన ఫలితాలు

Image
  కరోనా వైరస్‌ మహమ్మారికి ఆయుర్వేద విధానంలో ఔషదాన్ని కనుగొనేందుకు చేపట్టిన క్లినికల్‌ ట్రయల్స్‌లో సంచలనాత్మక ఫలితాలు వెలువడినట్టు తెలిసింది. శాస్త్రీయ విధానంలో కంటే ఆయుర్వేద పద్ధతిలో చికిత్స పొందుతున్న రోగులకు కొవిడ్-19 సమస్య త్వరగా నయమౌతోందని ఈ ఫలితాల్లో వెల్లడైంది. క్లినికల్‌ ట్రయల్స్‌ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా అనుమతి పొందిన అనంతరం.. ఇమ్మ్యునో ఫ్రీ, రెజిమ్యూన్‌లకు సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ను దేశంలోని మూడు ఆస్పత్రుల్లో నిర్వహించారు. శ్రీకాకుళంలోని గవర్నమెంట్‌ మెడికల్‌ హాస్పిటల్‌, గుజరాత్‌, వడోదరా లోని పారుల్‌ సేవాశ్రమ్‌ ఆస్పత్రి, మహారాష్ట్ర, పుణెలో లోక్‌మాన్య ఆస్పత్రిలో ఈ క్లినికల్‌ పరీక్షలు జరిగాయి. కోరివల్‌ లైఫ్‌ సైన్సెస్‌కు చెందిన ఇమ్మ్యునో ఫ్రీ, బయోజెటికాకు చెందిన రెజిమ్యూన్‌ అనే ఆయుర్వేద ఔషధాలు కొవిడ్‌ చికిత్సలో చక్కగా పనిచేస్తున్నట్టు తెలిసింది. ఈ ఔషధాలను ఉపయోగించి ఆయుర్వేద విధానంలో చికిత్స పొందిన రోగుల్లో 86.66 శాతం మందికి ఐదవ రోజున కరోనా నెగిటివ్‌ అని వెల్లడైంది. కాగా, సంప్రదాయ విధానంలో ఇది కేవలం 60 శాతంగా ఉంది. ఇక చికిత్స ఆరంభించిన పది రోజుల అనంతరం అందరికీ నెగిటివ్‌గా వ...