Posts

Showing posts with the label tradition

ఆరో రోజు అలిగిన బతుకమ్మ...! | Aligina bathukamma today

Image
ఆరో రోజు అలిగిన బతుకమ్మ...! వివరణ :   డా .  యం .  ఎన్ .  చార్య ,  ప్రముఖ   అంతర్జాతీయ   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   శాస్త్ర   పండితులు ,   శ్రీమన్నారాయణ   ఉపాసకులు ,  సునంద   రాజన్   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   కేంద్రం .  తార్నాక ,  హైదరాబాద్ .  ఫోన్ :   9440611151 ఆరో రోజు ' అలిగిన బతుకమ్మ ' ఎందుకంటే …? బతుకమ్మ పండుగలో ఆరో రోజును ' అలిగిన బతుకమ్మ ' అంటారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు. అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ పండుగ. ఆడపడచుల పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9 వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఐదురోజుల బతుకమ్మ వేడుకల్లో ఎంగిలిపువ్వు బతుకమ్మ , అటుకల బతుకమ్మ , ముద్దపప్పు బతుకమ్మ , నానబియ్యం బతుకమ్మ , అట్ల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఇక బతుకమ్మ పండుగలో ఆరో

శరన్నవరాత్రుల పూజా విధానం…! #Navaratrula puja vidhanam

Image
వివరణ :   డా .  యం .  ఎన్ .  చార్య ,  ప్రముఖ   అంతర్జాతీయ   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   శాస్త్ర   పండితులు ,   శ్రీమన్నారాయణ   ఉపాసకులు ,  సునంద   రాజన్   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   కేంద్రం .  తార్నాక ,  హైదరాబాద్ .  ఫోన్ : 9440611151 శరన్నవరాత్రుల పూజా విధానం ,  తప్పక తెలుసుకోవాల్సినవి శ్రీదేవీ శరన్నవరాత్రులు ప్రారంభించే ముందు రోజునాటికే పూజాసామగ్రి ,  పూజాద్రవ్యాలు ,  హోమద్రవ్యాలు సిద్దం చేసుకోవాలి. పూజామందిరంలో  9  అంగుళాలు ఎత్తుగల పీరాన్ని ఏర్పరచుకొని ,  పీఠముపై ఎర్రని వస్త్రము పరచి ,  బియ్యము పోసి ,  దానిపై సువర్ణ ,  రజిత ,  లేదా తామ్రా కలశమును ఉంచి ,  కలశమునకు దారములు చుట్టి ,  కలశములో పరిశుద్ద నదీజలములను నింపి ,  అందు లవంగములు ,  యాలకులు ,  జాజికాయ ,  పచ్చ కర్పూరము మొదలగు సువర్ణ ద్రవ్యాలు వేసి ,  నవరత్నాలు ,  పంచలోహాలను వేసి ,  పసుపు ,  కుంకుమ ,  రక్తచందన ,  చందనాదులను వేసి ,  మామిడి ,  మారేడు ,  మోదుగ ,  మర్రి ,  జమ్మి చిగుళ్ళను ఉంచి ,  పరిమళ పుష్పాదులను వేసి ,  దానిపై పీచు తీయని ,  ముచ్చిక కలిగిన టెంకాయనుంచి ,  దానిపై ఎర్రని చీర ,  రవిక వేసి ,  కలశమును చందన ,  కుంకుమ ,  పుష్ప