గ్రీన్, అల్లం టీ మాటలు విన్న ప్రజలు కొత్తగా తందూరు చాయ్ తయారుకావడంతో…!
గ్రీన్ , అల్లం టీ మాటలు విన్న ప్రజలు కొత్తగా తందూరు చాయ్ తయారుకావడంతో …! కరోనా ఉద్యోగాన్ని కాటేసింది. దీంతో లక్షల రూపాయల ఉద్యోగాన్ని కోల్పోయాడు ఆ యువకుడు. కానీ అత్మవిశ్వాశాన్ని కోల్పోలేదు. ఉద్యోగం పోయిందనే నిరాశతో ఇంట్లో కూర్చోలేదు. తన ఆలోచనలకు పదునుపెట్టాడు. అందరికంటే భిన్నంగా ఆలోచించి తందూరీ చాయ్‌ను తయారు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఇప్పుడు ఆ చాయ్‌కి యమగిరాకీ పెరిగింది. అలాంటి అద్భుతమైన తందూరి చాయ్ తాగడానికి ప్రజలు క్యూ కడుతున్నారు. అందరినీ ఆకట్టుకుంటున్న తందూరి చాయ్‌పై స్పెషల్ స్టోరీ. నిర్మల్ జిల్లా చించోలిబి గ్రామానికి చెందిన కోంతం గంగాధర్. అందరిలానే కరోనా దెబ్బకు నష్టపోయిన వారిలో ఇతను ఒకడు. కరోనా రాకముందే దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ఉద్యోగం చేస్తుండేవాడు. అయితే అంతకు మించి ప్రసిద్ధి చెందిన ఇటలీలోని ఓ హోటల్‌లో ఉద్యోగానికి గంగాధర్ సెలక్ట్ అయ్యాడు. నెలకు రెండు లక్షల జీతం. దీంతో ఇటలీ వెళ్దామని భావించి దుబాయిలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి చేరాడు. అయితే ఇంటికి రాగానే కరోనా విజృంభించింది. పైగా ఇటలీలో ఈ మహమ్మారి వేల మందిని బలి తీసుకుంది. ఇటలీకి ...