వాస్తు ప్రకారం ఈ దిశవైపు ఎత్తుగా ఉంటే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యం తప్పదట…!
వాస్తు ప్రకారం ఈ దిశవైపు ఎత్తుగా ఉంటే స్థిరాస్తుల అమ్మకం , అనారోగ్యం తప్పదట…! ఇల్లు నిర్మిస్తున్నాం అనుకోగానే వాస్తు పట్టించుకునేవారంతా ముందుగా గమనించేది దిక్కులు. ఏ దిక్కున ఏం ఉండాలని ముందుగానే ప్లాన్ వేసుకుంటారు. ఎందుకంటే మనకున్న ఎనిమిది దిక్కుల్లో ఒక్కో దిక్కుకి ఒక్కో దేవత అధిపతి. వారు శాంతించేలా ఇంటి నిర్మాణం ఉండేలా చూసుకుంటే అంతా శుభమే. మరి ఏ దిక్కున ఏం నిర్మించాలి , ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. తూర్పు : తూర్పు దిక్కును ఇంద్రుడు పాలిస్తుంటాడు. ఇంద్రుడు సంతానం, ఐశ్వర్యాలను కలిగిస్తాడని ప్రతీతి. అందుకే తూర్పు భాగంలో ఎక్కువ బరువు పెట్టడం మంచిది కాదు. అందుకే ఈ దిక్కున ఖాళీ స్థలంలో బావులు, బోర్లు నిర్మిస్తే శుభం. పడమర : పడమర దిక్కుకు అధిష్టాన దేవత వరుణడు. గృహ నిర్మాణ సమయంలో తూర్పు వైపు కన్నా పడమటి వైపు తక్కువ స్థలం విడిచిపెట్టాలి, ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఈ భాగంలో కూడా మంచినీటి బావులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్తరం : ఈ దిక్కుకు అధిష్టాన దేవత కుబేరుడు. దక్షిణ దిక్కుకంటే పల్లంగా విశాలంగా ఉండేలా చూసుకోవాలి. ఈ దిక్కున కూడా బోరు తవ్వించవచ్చు.ఈ జాగ్రత్తలు తీసుకుంటే విద్య, ఆదాయం...