Posts

Showing posts with the label jaganatha temple

పూరీ ఆలయంలో ఇలా జరిగిందేంటి...?

Image
  పూరీ ఆలయంలో ఇ లా జరిగిందేంటి... ?   ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో పనిచేస్తున్న 400 మందికి పైగా సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఒడిశా ప్రభుత్వ అధికారులు సోమవారం స్పష్టం చేశారు. పూరీ శిరిమందిరాన్ని తిరిగి భక్తుల సందర్శన కోసం తెరవాలని డిమాండ్లు వినిపిస్తున్న సమయంలో... అధికారులు ఈ విషయం బయటపెట్టారు. " 400 మందిలో 9 మంది కరోనా వైరస్ వల్ల చనిపోయారు. 16 మందికి భువనేశ్వర్‌లోని కోవిడ్ 19 ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతోంది" అని శ్రీ జగన్నాథ ఆలయ పర్యవేక్షణ , పాలన అధికారి అజయ్ కుమార్ జెనా తెలిపారు. కరోనా సోకిన చాలా మంది ఆలయ సిబ్బంది ఇళ్ల దగ్గరే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఆయన వివరించారు. అందువల్ల ఆలయాన్ని తెరిచేందుకు , భక్తులను అనుమతించేందుకు సిబ్బంది కొరత ఉందన్నారు.   ప్రస్తుతం పూరీ ఆలయం భక్తుల కోసం తెరవకపోయినా... రోజువారీ పూజలు జరుగుతున్నాయి. ఆలయ పూజారులు మాత్రం... నవంబర్ చివరి వరకూ ఆలయంలోకి భక్తులను అనుమతించకపోవడం మేలంటున్నారు. తమ వర్గానికి చెందిన వారికే ఎక్కువగా కరోనా సోకుతోందని అభ్యంతరం చెబుతున్నారు. ఇదే విషయాన్ని రిపోర్టు రూపంలో హైకోర్టుకు సమర్పించింద...