బిగబాస్: ఈ వారం నామినేషన్‌లో ఆ ఏడుగురు
బిగబాస్: ఈ వారం నామినేషన్‌లో ఆ ఏడుగురు సోమవారం వస్తే ఎలిమినేషన్‌కు సంబంధించి నామినేషన్ ప్రక్రియ జరగడం కామన్. ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఏడుగురు సభ్యులు ఉండగా , వారిలో ఎవరు ఇంటిని వీడనున్నారనేది ఆసక్తిగా మారింది. సోమవారం ఎసిపోడ్ గోంగూర తోట కాడ కాపుకాశా అనే పాటతో మొదలైంది. ఆ తర్వాత మార్నింగ్ మస్తీలో భాగంగా స్వాతీ దీక్షిత్ మిగతా ఇంటి సభ్యులకు నవరసరాలు నేర్పించింది. శంగార రసం అభిజిత్‌తో చేయగా , విషాదం నోయల్‌తో చేసింది. తండ్రి పాత్రని నోయల్ పోషించగా , ఆయన చనిపోయిన క్రమంలో స్వాతి వెక్కి వెక్కి ఏడ్చింది. అది చూసి మోనాల్ కూడా కంట కన్నీరు పెట్టుకుంది. భీభత్సం, రసం పండించేందుకు నోయల్-లాస్య రంగంలోకి దిగారు. వీరిద్దరు నటనకు అంతా ఫిదా అయ్యారు. గట్టిగా గట్టిగా అరుస్తూ తమ తమ పాత్రలలో తెగ జీవించేశారు. ఇక ఆ తర్వాత దివి నామినేషన్ విషయంలో మెహబూబ్ తో పాటు అభిజిత్‌తో చర్చించింది. అనంతరం అవినాష్... అరియానాతో రొమాంటిక్ చర్చలు జరపగా , ఆ తర్వాత మోనాల్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కొంత సేపు హాస్యం పండించి అందరిని నవ్వించాడు. ఇక బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టగా ఇం...