Posts

Showing posts with the label india

2020 సంవత్సరంలో దసరా పండగ ఎప్పుడు…! | Vijaya Dashami in 2020

Image
2020 సంవత్సరంలో దసరా పండగ ఎప్పుడు …! వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 విజయదశమి అంటే ఆరోజు సూర్యోదయానికి శ్రవణ నక్షత్రం ఉండాలి. శ్రవణ నక్షత్రానికి అధిదేవత విష్ణువు. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది. శమీ చెట్టు యొక్క పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజా స్థలంలో , ధన స్థానంలో నగదు గల్ల పెట్టెల్లో పెట్టుకుంటారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది. నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు , తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక

లద్దాఖ్‌ను కలిపే మరో సొరంగం రెడీ అవుతోంది...!

Image
లద్దాఖ్‌ను కలిపే మరో సొరంగం రెడీ అవుతోంది... ! హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి లద్దాఖ్‌కు ఏడాది పొడవునా ప్రయాణించేందుకు వీలుగా ఈ మధ్యనే అటల్‌ టన్నెల్‌ పూర్తయింది. రెండు ప్రాంతాల ప్రజల దశాబ్దాల నాటి కల నెరవేరింది. అయితే ఇప్పుడు అలాంటి మరో టన్నెల్‌నే నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దానిపేరే జోజిలా పాస్‌ టన్నెల్‌. శ్రనగర్‌ నుంచి లద్దాఖ్‌ వరకు ఈ సొరంగం నిర్మాణం జరగనుంది. దీని నిర్మాణం కోసం కూడా ఎన్నో ఏళ్లుగా స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ అనేక కారణాలతో దీని నిర్మాణం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు గురువారం ఈ టన్నెల్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.   జోజిలా పాస్‌ టన్నెల్‌ ద్వారా శ్రీనగర్‌-లద్దాఖ్‌ల మధ్య సంవత్సరం పొడవునా వాహనాల రాకపోకలకు అవకాశం ఏర్పడుతుంది.   అంతేకాకుండా వ్యాపార లావాదేవీలు జరిపేందుకు , కూలి పనులు చేసుకునేందుకు ఈ మార్గం ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే అటల్‌ టన్నెల్‌ నిర్మాణం తరువాత కేంద్రం జోజిలా టన్నెల్‌పై దృష్టి సారించింది. రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ టన్నెల్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. స్వయంగా మొదటి బ్లాస్టింగ్‌

చైనాతో మరోమారు యుద్ధం తప్పదా…!

Image
చైనాతో మరోమారు యుద్ధం తప్పదా …!   సరిహద్దు సమస్య చర్చల ద్వారా పరిష్కారం అయ్యే సూచనలు కనుచూపుమేరలో కనిపించని నేపథ్యంలో చైనా భారత్ పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతున్న సూచనలు కనబడుతున్నాయి. అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణులతో సహా భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించి పలు క్షిపణులను భారత్ చైనాతో సరిహద్దుల్లో మోహరించింది. దీనికి ప్రతిగా చైనా కూడా రెండు వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను మోహరించింది. రెండుదేశాల సన్నాహకాలను చూస్తుంటే సమీప భవిష్యత్తులో ఇరుదేశాలూ యుద్దానికి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోందని రక్షణరంగ నిపుణులు పేర్కొంటున్నారు. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా భారత్ , చైనాలు తమ తమ సరిహద్దుల రక్షణ కోసం , ప్రత్యర్థి దేశంపై దాడి కోసం ఆధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నాయి.  2 వేల కి.మీల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను , భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను జిన్‌జియాంగ్ , టిబెట్‌ ప్రాంతాల్లో చైనా మోహరించింది. ప్రతిగా బ్రహ్మోస్ , నిర్భయ్ , భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల ఆకాశ్‌ క్షిపణులను భారత్‌ సిద్ధం చేసింది.   భారత్ సేకరించిన క్షిపణుల్లో బ్రహ్మో

పాకిస్థాన్‌ మంగళవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది.

Image
  పాకిస్థాన్‌ మంగళవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. పాకిస్థాన్‌ మంగళవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. పూంచ్‌ జిల్లా మాన్‌కోట్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట కాల్పులకు పాల్పడింది. దాయాదీ సైనికులు చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపి , మోర్టార్లతో షెల్లింగ్స్‌ చేశారని రక్షణశాఖ ప్రజాసంబంధాల అధికారి ఒకరు తెలిపారు. భారత జవాన్లు ధీటుగా స్పందించడంతో వెనక్కు తగ్గారని పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వెంట నిత్యం ఏదో ఒకచోట పాక్‌ కాల్పులకు తెగబడుతూ తన వక్రబుద్ధి ప్రదర్శిస్తూనే ఉంది. కొంతకాలంగా పూంచ్‌ , రాజౌరీ జిల్లాల్లో భారత పౌరులు , సైనిక పోస్టులే లక్ష్యంగా పాక్ సైనికులు గుళ్లవర్షం కురిపిస్తున్నారు. అటు , ఉత్తర కశ్మీర్‌ బారాముల్లా జిల్లా రామ్‌పూర్ సెక్టార్‌లోనూ ఇటీవల పాక్‌ సైన్యం కాల్పులు జరపగా భారత్ ధీటుగా బదులిచ్చింది.

భారత్‌కు చైనా వైరస్ రూపంలో మరో గండం…!

Image
  భారత్‌కు చైనా వైరస్ రూపంలో మరో గండం …! భారత్‌కు చైనా వైరస్ రూపంలో మరో గండం పొంచి ఉంది. ఇప్పటికే కరోనాతో యావత్ ప్రపంచం వణికిపోతుంటే.. తాజాగా మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. వూహాన్‌ కేంద్రంగా ' క్యాట్ క్యూ ' అనే వ్యాధిని వైద్య అధికారులు గుర్తించారు. దీని కారణంగా మన దేశానికి కూడా ప్రమాదం పొంచి ఉందని ఐసీఎంఆర్ హెచ్చరించింది. దోమలు , పందులను వాహకాలుగా చేసుకొని ఇది మనుషులకు వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. మన దేశంలో ఇది ఎంత మందిలో ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.   చైనా , తైవాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనాల్లో ఇటీవల ఈ వైరస్ వెలుగు చూసింది. దీంతో భారత్‌లో కొన్ని శాంపిళ్లను ఐసీఎంఆర్ సేకరించింది. దేశవ్యాప్తంగా 883 సీరం శాంపిళ్లను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో పరీక్షించగా , రెండు నమూనాల్లో క్యాట్‌ క్యూ వైర్‌సను తిప్పికొట్టే ఐజీజీ యాంటీబాడీల జాడను గుర్తించారు.   వీటిలో నేరుగా వైరస్ మాత్రం కనిపించలేదు. దీంతో మరికొంత మంది శాంపిళ్లను పరీక్షించాలని అభిప్రాయపడ్డారు. మలేరియా , డెంగీ , హంటా వ్యాధులు ప్రభలే అవకాశం ఉందన్నారు. కాగా మన దేశంలో క్యూలెక్స్ దోమలు , ప

ఈరోజు, రేపట్లో అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు...!

Image
  జనజీవనం సాధారణ పరిస్థితికి రావడంతో అన్‌లాక్‌ 5ను ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రస్తుతం నడుస్తున్న అన్‌లాక్‌ 4 మరో రెండు రోజుల్లో పూర్తవుతుంది. దీంతో ఇవాళ సాయంత్రం లేదా,రేపు అన్‌లాక్‌ 5 ను కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇప్పటికే మెట్రో సర్వీసులకు, నిబంధనలతో 9-12 తరగతులకు విద్యార్థులకు మినహాయింపులు ఇచ్చారు. అక్టోబరు 1 నుంచి అన్‌లాక్‌ 5.0 ప్రారంభంకానుంది. దీంతో అక్టోబరులో వేటికి మినహాయింపులు ఇస్తారని జనం ఎదురుచూస్తున్నారు. గత వారం వర్చువల్‌గా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రాల వారీగా వారి అభిప్రాయాలను సేకరించారు. కంటైన్‌మెంట్‌ జోన్లను 'మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా' గుర్తించాలని సలహాలు, సూచనలు అందాయి. త్వరలో దసరా, దీపావళి పండగలు ఉండటంతో మరిన్ని కార్యకలాపాలకు కేంద్రం అనుమతించే అవకాశం ఉంది. నిబంధనలతో మాల్స్‌, సెలూన్లు, రెస్టారెంట్లు, జిమ్‌లను తెరిచేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతి ఇవ్వగా, ఈ సారి మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. సినిమా హాళ్లకు అనుమతి ఇస్తారని సమాచారం. అలానే కరోనాత

పాక్ కుట్ర: ఇండియాలో ఉగ్రవాదుల ట్రైనింగ్

Image
  భారత్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్‌ కొత్త తరహా కుట్రలు పన్నుతోంది. ఉగ్రవాద శిక్షణ శిబిరాలను జమ్మూ-కాశ్మీర్ సరిహద్దుల నుంచి భారత్ - నేపాల్ సరిహద్దులకు విస్తరించింది. భారత - నేపాల్ సరిహద్దు రాష్ట్రాలయిన ఉత్తరప్రదేశ్, బీహార్ లకు సమీపంలో పెద్ద సంఖ్యలో మసీదులు, మదర్సాలను భద్రతా ఏజెన్సీలు తాజాగా గుర్తించాయి. బీహార్, యుపిలోని నేపాల్ సరిహద్దు లలో వీటిని దవాత్ ఇ ఇస్లామి టెరరిస్ట్‌ సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. ఇప్పటి వరకు యువతను ఉగ్రవాదులుగా మార్చడానికి 1.25 కోట్ల డబ్బును కూడా సేకరించినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. స్థానిక యువతతో పాటు బంగ్లాదేశ్ నుంచి కూడా రిక్రూట్ చేసుకుంటున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి.

సరిహద్దులకు భారీగా చైనా బలగాలు...!

Image
  సరిహద్దులకు భారీగా చైనా బలగాలు...! లడఖ్‌ లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఐసి) వద్ద భారతీయ , చైనా దళాల మధ్య ఉద్రిక్తతల మధ్య , చైనా తన సైనికులను ఎల్‌ఐసి సమీపంలో పెద్ద సంఖ్యలో మోహరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం (సెప్టెంబర్ 7), చుషుల్ వద్ద ఉన్న ముఖ్రి ప్రాంతానికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) చొరబాటు ప్రయత్నాలను అడ్డుకోవడంలో భారత సైన్యం విజయవంతమైంది.   అయితే రాబోయే రోజుల్లో చైనా నుండి ఇలాంటి మరిన్ని చర్యలు వచ్చే అవకాశం ఉందని ఆర్మీ పేర్కొంది. సెప్టెంబర్ 1 న , చైనా ఎల్‌ఐసి వద్ద రెచిన్ లా సమీపంలో పిఎల్‌ఎ గ్రౌండ్ ఫోర్స్ చెందిన బెటాలియన్‌ ను చైనా మోహరించింది. అలాగే స్పాంగూర్ సరస్సు సమీపంలో రెండు బెటాలియన్లను కూడా మోహరించింది.   ఇవన్నీ శిక్వాన్ వద్ద ఉన్న 62 కంబైన్డ్ ఆర్మ్స్ బ్రిగేడ్‌లో భాగం అని అధికారులు పేర్కొన్నారు.  

పాకిస్థాన్ తో కలిసి రెండు వైపుల దాడి చేయడానికి చైనా కుట్ర…!

Image
పాకిస్థాన్ తో కలిసి రెండు వైపుల దాడి చేయడానికి చైనా కుట్ర…!

No ban Tiktok in India | టిక్‌టాక్ యాప్‌ బ్యాన్ వార్తలపై…!

Image
No ban Tiktok in India | టిక్‌టాక్ యాప్‌ బ్యాన్ వార్తలపై…!