Posts

Showing posts with the label corona

ఫిబ్రవరికల్లా సగం జనాభాకు కరోనా...! | Corona to half the population by February

  ఫిబ్రవరికల్లా సగం జనాభాకు కరోనా ...! భారత జనాభాలో కనీసం సగం మందికి వచ్చే ఫిబ్రవరి నాటికి కరోనా సోకే ప్రమాదముందని కరోనా వైరస్ ‌ అంచనాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల్లో ఒకరైన అగ్రవాల్ ‌ వెల్లడించారు . ఇప్పటి వరకు దేశంలో 75 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి . పాజిటివ్ ‌ కేసుల సంఖ్యలో అమెరికా తర్వాతి స్థానం భారత్ ‌ దే . సెప్టెంబర్ ‌ మధ్య నాటికి అత్యధిక స్థాయికి చేరిన కరోనా వ్యాప్తి ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందని , సగటున రోజూ 61,390 కొత్త కేసులు నమోదౌతు న్నాయని తెలిపారు . మేం అనుసరించిన మోడల్ ‌ అంచనాల ప్రకారం దేశ జనాభాలో ఇప్పుడు దాదాపు 30 శాతం జనాభా కరోనా బారిన పడ్డారు , ఇది ఫిబ్రవరి నాటికి 50 శాతానికి చేరవచ్చు ’ అని ప్రభుత్వ కమిటీ సభ్యులు , కాన్పూర్ ‌ ఐఐటికి చెందిన మణీంద్ర అగ్రవాల్ ‌ తెలిపారు . కేంద్ర ప్రభుత్వ సీరోలాజికల్ ‌ సర్వేలతో పోల్చుకుంటే కరోనా వ్యాప్తి అధికంగా ఉందని ఈ కమిటీ అంచనా వేసింది . అతి తక్కువ జనాభాతో సర్వే చేయడంతో , సీరోలాజికల్ ‌ అంచనాలు వాస్తవాలకు దగ్గరగా లేవని అగ్రవాల్ ‌ తెలి...

పూరీ ఆలయంలో ఇలా జరిగిందేంటి...?

Image
  పూరీ ఆలయంలో ఇ లా జరిగిందేంటి... ?   ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో పనిచేస్తున్న 400 మందికి పైగా సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఒడిశా ప్రభుత్వ అధికారులు సోమవారం స్పష్టం చేశారు. పూరీ శిరిమందిరాన్ని తిరిగి భక్తుల సందర్శన కోసం తెరవాలని డిమాండ్లు వినిపిస్తున్న సమయంలో... అధికారులు ఈ విషయం బయటపెట్టారు. " 400 మందిలో 9 మంది కరోనా వైరస్ వల్ల చనిపోయారు. 16 మందికి భువనేశ్వర్‌లోని కోవిడ్ 19 ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతోంది" అని శ్రీ జగన్నాథ ఆలయ పర్యవేక్షణ , పాలన అధికారి అజయ్ కుమార్ జెనా తెలిపారు. కరోనా సోకిన చాలా మంది ఆలయ సిబ్బంది ఇళ్ల దగ్గరే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఆయన వివరించారు. అందువల్ల ఆలయాన్ని తెరిచేందుకు , భక్తులను అనుమతించేందుకు సిబ్బంది కొరత ఉందన్నారు.   ప్రస్తుతం పూరీ ఆలయం భక్తుల కోసం తెరవకపోయినా... రోజువారీ పూజలు జరుగుతున్నాయి. ఆలయ పూజారులు మాత్రం... నవంబర్ చివరి వరకూ ఆలయంలోకి భక్తులను అనుమతించకపోవడం మేలంటున్నారు. తమ వర్గానికి చెందిన వారికే ఎక్కువగా కరోనా సోకుతోందని అభ్యంతరం చెబుతున్నారు. ఇదే విషయాన్ని రిపోర్టు రూపంలో హైకోర్టుకు సమర్పించింద...

ఈరోజు, రేపట్లో అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు...!

Image
  జనజీవనం సాధారణ పరిస్థితికి రావడంతో అన్‌లాక్‌ 5ను ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రస్తుతం నడుస్తున్న అన్‌లాక్‌ 4 మరో రెండు రోజుల్లో పూర్తవుతుంది. దీంతో ఇవాళ సాయంత్రం లేదా,రేపు అన్‌లాక్‌ 5 ను కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇప్పటికే మెట్రో సర్వీసులకు, నిబంధనలతో 9-12 తరగతులకు విద్యార్థులకు మినహాయింపులు ఇచ్చారు. అక్టోబరు 1 నుంచి అన్‌లాక్‌ 5.0 ప్రారంభంకానుంది. దీంతో అక్టోబరులో వేటికి మినహాయింపులు ఇస్తారని జనం ఎదురుచూస్తున్నారు. గత వారం వర్చువల్‌గా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రాల వారీగా వారి అభిప్రాయాలను సేకరించారు. కంటైన్‌మెంట్‌ జోన్లను 'మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా' గుర్తించాలని సలహాలు, సూచనలు అందాయి. త్వరలో దసరా, దీపావళి పండగలు ఉండటంతో మరిన్ని కార్యకలాపాలకు కేంద్రం అనుమతించే అవకాశం ఉంది. నిబంధనలతో మాల్స్‌, సెలూన్లు, రెస్టారెంట్లు, జిమ్‌లను తెరిచేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతి ఇవ్వగా, ఈ సారి మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. సినిమా హాళ్లకు అనుమతి ఇస్తారని సమాచారం. అలానే కరోనా...

కరోనా చికిత్స: ఆయుర్వేదంతో అద్భుతమైన ఫలితాలు

Image
  కరోనా వైరస్‌ మహమ్మారికి ఆయుర్వేద విధానంలో ఔషదాన్ని కనుగొనేందుకు చేపట్టిన క్లినికల్‌ ట్రయల్స్‌లో సంచలనాత్మక ఫలితాలు వెలువడినట్టు తెలిసింది. శాస్త్రీయ విధానంలో కంటే ఆయుర్వేద పద్ధతిలో చికిత్స పొందుతున్న రోగులకు కొవిడ్-19 సమస్య త్వరగా నయమౌతోందని ఈ ఫలితాల్లో వెల్లడైంది. క్లినికల్‌ ట్రయల్స్‌ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా అనుమతి పొందిన అనంతరం.. ఇమ్మ్యునో ఫ్రీ, రెజిమ్యూన్‌లకు సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ను దేశంలోని మూడు ఆస్పత్రుల్లో నిర్వహించారు. శ్రీకాకుళంలోని గవర్నమెంట్‌ మెడికల్‌ హాస్పిటల్‌, గుజరాత్‌, వడోదరా లోని పారుల్‌ సేవాశ్రమ్‌ ఆస్పత్రి, మహారాష్ట్ర, పుణెలో లోక్‌మాన్య ఆస్పత్రిలో ఈ క్లినికల్‌ పరీక్షలు జరిగాయి. కోరివల్‌ లైఫ్‌ సైన్సెస్‌కు చెందిన ఇమ్మ్యునో ఫ్రీ, బయోజెటికాకు చెందిన రెజిమ్యూన్‌ అనే ఆయుర్వేద ఔషధాలు కొవిడ్‌ చికిత్సలో చక్కగా పనిచేస్తున్నట్టు తెలిసింది. ఈ ఔషధాలను ఉపయోగించి ఆయుర్వేద విధానంలో చికిత్స పొందిన రోగుల్లో 86.66 శాతం మందికి ఐదవ రోజున కరోనా నెగిటివ్‌ అని వెల్లడైంది. కాగా, సంప్రదాయ విధానంలో ఇది కేవలం 60 శాతంగా ఉంది. ఇక చికిత్స ఆరంభించిన పది రోజుల అనంతరం అందరికీ నెగిటివ్‌గా వ...

భాగ్యనగరంలో లాక్‌డౌన్ ఉన్నట్లా… లేనట్లా…!

Image
భాగ్యనగరంలో లాక్‌డౌన్ ఉన్నట్లా… లేనట్లా…!

కరోనా కేసులతో బీఆర్కే భవన్ గజ గజ…!

Image
కరోనా కేసులతో బీఆర్కే భవన్ గజ గజ…!

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు…!

Image
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు…!