అక్టోబర్ 2020 ద్వాదశ రాశుల వారికి మాసఫలాలు
అక్టోబర్ 2020 ద్వాదశ రాశుల వారికి మాసఫలాలు వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 మేషరాశి ( Aries) వారికి: ఈ నెలలో ఆశాజనకంగా ఉంటుంది , మానసిక ఒత్తిడిలు , చికాకులు తగ్గును. అధికారులతో సామరస్యంగా ఉండగలరు. సంతృప్తికర పరిస్థితులు ఏర్పడును. స్నేహబంధాలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యూహాత్మకంగా పనులను చక్కబెట్టుకుంటారు. వ్యాపారములు వృద్ధి చెందును. ఆశించిన ధనాదాయం లభించును. కోర్టు కేసులు అనుకూలంగా ముగియును. నూతన మిత్ర వర్గం ఏర్పడును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొను అవకాశములు అధికం. పరమార్ధిక చింతన అధికమగును. ఉద్యోగ జీవులకు విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవలసిన సమయం ఏర్పడును. ప్రభుత్వ సంబంధ ఉద్యోగం ఆశిస్తున్న వారికి ఈ మాసంలో ద్వితీయ లేదా తృతీయ వారాలలో కష్టాలు తీరును. విద్యార్ధులకు చక్కని భవిష్యత్ లభించును. ఈ మాసంలో 23 , 24 తేదీలలో ప్రయాణములందు జాగ్రత్తగా ఉండవలెను. అనుకూలమైన శుభ ఫలితాల క...