Posts

Showing posts from October, 2020

Secret behind sneezing | తుమ్ముల రహస్యం | Dr L Umaa Venkatesh | PSLV TV ...

Image

ఈ రోజు నుండి దేవి 'త్రిరాత్ర' వ్రతం ప్రారంభం | Tri ratra vratham starts

Image
ఈ రోజు నుండి దేవి ' త్రిరాత్ర ' వ్రతం ప్రారంభం వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం నవరూప ధరాం శక్తిం , నవదుర్గాముపాశ్రయే జగజ్జనని అయిన అమ్మవారి దయతోనే సర్వ జగత్తూ నడయాడుతోంది. ఆ అమ్మ కరుణా పారీణ. ఆ తల్లి అమృతహృదయ. ఆమె చల్లని చూపులకోసం అఖిలాండాలు ఎదురు చూస్తుంటాయ. అందుకే ఆరాధించడానికి తిథి వార నక్షత్రాలు లేకపోయినా ఈ ఆశ్వీయుజమాసాన వచ్చే శుద్ధ పాడమి మొదలుకుని నవమి వరకు ఆ తల్లిని కొలిచినవారికి కోటిజన్మలలోని పాపరాశి భస్మమవడమే కాదు తుదిలేని పుణ్యరాశి లభ్యవౌతుందట. అందుకే సజ్జను లందరూ ఈ జగాలనేలే జగన్మాత వ్రతాన్ని ఆచరించడానికి వేయ్యి కనులతో ఎదురు చూస్తుంటారని , అలా చూసి అమ్మ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయని దేవీభాగవతం చెబుతోంది. ఈ వ్రతరాజాన్నే దుర్గాదేవి వ్రతమని , కుమారీ పూజ అనీ అంటారు. ఈ చల్లని తల్లిని మనలోని తిమిరాంధకారాన్ని పారద్రోలమని రాత్రివే

Vedic maths tricks in telugu | Speed maths raja | PSLV TV NEWS

Image

2020 సంవత్సరంలో దసరా పండగ ఎప్పుడు…! | Vijaya Dashami in 2020

Image
2020 సంవత్సరంలో దసరా పండగ ఎప్పుడు …! వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 విజయదశమి అంటే ఆరోజు సూర్యోదయానికి శ్రవణ నక్షత్రం ఉండాలి. శ్రవణ నక్షత్రానికి అధిదేవత విష్ణువు. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది. శమీ చెట్టు యొక్క పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజా స్థలంలో , ధన స్థానంలో నగదు గల్ల పెట్టెల్లో పెట్టుకుంటారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది. నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు , తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక

వారఫలితాలు: తేదీ 23 అక్టోబర్ శుక్రవారం నుండి 29 గురువారం 2020 వరకు | #Weekly Astrology October 2020

Image
వారఫలితాలు: తేదీ 23 అక్టోబర్ శుక్రవారం నుండి 29 గురువారం 2020 వరకు వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 మేషరాశి ( Aries) అశ్విని , భరణి , కృత్తిక 1 వ పాదం వారికి: ఈ వారం   వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త   హోదాలు రావచ్చు. పారిశ్రామిక వర్గాలకు శ్రమకు తగిన ఫలితం దక్కే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పనులు నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్నా అవసరాలకు ఇబ్బంది ఉండదు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి . అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి , పశు , పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు , ర