సరికొత్త సేఫ్టీ ఫీచర్లతో కొత్త మహీంద్రా థార్
భారతదేశ ప్రఖ్యాత వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా రాబోయే పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని నూతన ఎయూవీ థార్ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆగస్టు 15న 74 వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహీంద్రా థార్ ను విడుదల చేసింది. అక్టోబర్ 2న అధికారికంగా అమ్మకాలు మొదలవుతాయని మహీంద్రా ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుండి కారు యొక్క మొదటి యూనిట్ వేలం పారంభమైంది. మహీంద్రా థార్ వాహనానికి ఇప్పటివరకు అత్యధిక ఆన్లైన్ బిడ్ రూ .79.25 లక్షలుగా నమోదైందని రష్ లేన్లో ప్రచురించిన ఒక నివేదిక పేర్కొంది. కాగా ఈ వేలం సెప్టెంబర్ 29 వరకు కొనసాగనుంది. ఇది ఇలాగే కొనసాగితే ఆన్లైన్ బిడ్ ధర రూ.1 కోటి దాటే అవకాశం ఉందని ఈ నివేదిక పేర్కొంది. నూతనంగా విడుదల కాబోయే ఆల్-న్యూ థార్ ఈ సిరీస్లో సెకండ్ జనరేషన్ వాహనం కానుంది. కొత్త మహీంద్రా థార్ పెట్రోల్ మరియు డీజిల్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఇదివరకే మార్కెట్లో ఉన్న మహీంద్రా థార్ కారుకు అనేక నూతన ఫీచర్లను యాడ్ చేసి బీఎస్-6 ప్రమాణాలతో ఈ సెకండ్ జనరేషన్ వెహికిల్ను విడుదల చేయనుంది. కొనుగోలుదారుడు పెట్రోల్ లేదా డీజిల్ రెండు వేరియంట్లలో దేన్నైనా ఎంచుకోవచ్చు.కొత్త మహ