Posts

Showing posts with the label assembly

సభ ముందుకు కొత్త రెవెన్యూ బిల్లు, కీలక అంశాలు…!

Image
  సభ ముందుకు కొత్త రెవెన్యూ బిల్లు , కీలక అంశాలు …!   తెలంగాణ శాసనసభలో రెవెన్యూ బిల్లులను ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రవేశపెట్టిన బిల్లుల్లో భూమిపై హక్కులు , పాస్‌పుస్తకాల చట్టం - 2020, గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు చట్టం - 2020 ఉన్నాయి. కేంద్ర , రాష్ట్రాల భూములకు చట్టంలోని అంశాలు వర్తించవు అని ప్రభుత్వం తెలిపింది. భూలావాదేవీలకు వెబ్‌సైట్‌ ద్వారా స్లాట్‌ కోసం దరఖాస్తు చేయాలి. సబ్‌రిజిస్ట్రార్‌ ఇచ్చిన సమయానికి పత్రాలు ఇచ్చి సేవలు పొందాలి. భూములను మార్ట్‌గేజ్ చేస్తే ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేయించాలి. పూర్తిగా ఎలక్ట్రానిక్‌ విధానంలో భూరికార్డుల నిర్వహణ ఉంటుంది. భూమి హక్కుపత్రం , పట్టాదారు పాస్‌పుస్తకం ఏకీకృతం చేస్తాం. భూహక్కుల రికార్డుల్లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు ఉంటాయి. ధరణి పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా భూయాజమాన్య హక్కుల బదిలీ ఉంటుంది. అని ప్రభుత్వం స్పష్టం చేసింది.   బిల్లులోని ముఖ్యాంశాలు: నిబంధనలకు విరుద్ధంగా భూమి హక్కుల రికార్డుల అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారిపై క్రిమినల్ చర్యలతోపాటు సర్వీసు నుంచి తొలగింపు , భర్తరఫ్ , శిక్ష. రైతులకు పట్టాదార