Posts
Showing posts with the label pslvtv
మీ కను రెప్ప కొట్టుకుంటుందా…! ఆరోగ్యానికి ఇది మంచిది కాదా…!
- Get link
- X
- Other Apps
వాస్తు ప్రకారం ఈ దిశవైపు ఎత్తుగా ఉంటే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యం తప్పదట…!
- Get link
- X
- Other Apps
వాస్తు ప్రకారం ఈ దిశవైపు ఎత్తుగా ఉంటే స్థిరాస్తుల అమ్మకం , అనారోగ్యం తప్పదట…! ఇల్లు నిర్మిస్తున్నాం అనుకోగానే వాస్తు పట్టించుకునేవారంతా ముందుగా గమనించేది దిక్కులు. ఏ దిక్కున ఏం ఉండాలని ముందుగానే ప్లాన్ వేసుకుంటారు. ఎందుకంటే మనకున్న ఎనిమిది దిక్కుల్లో ఒక్కో దిక్కుకి ఒక్కో దేవత అధిపతి. వారు శాంతించేలా ఇంటి నిర్మాణం ఉండేలా చూసుకుంటే అంతా శుభమే. మరి ఏ దిక్కున ఏం నిర్మించాలి , ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. తూర్పు : తూర్పు దిక్కును ఇంద్రుడు పాలిస్తుంటాడు. ఇంద్రుడు సంతానం, ఐశ్వర్యాలను కలిగిస్తాడని ప్రతీతి. అందుకే తూర్పు భాగంలో ఎక్కువ బరువు పెట్టడం మంచిది కాదు. అందుకే ఈ దిక్కున ఖాళీ స్థలంలో బావులు, బోర్లు నిర్మిస్తే శుభం. పడమర : పడమర దిక్కుకు అధిష్టాన దేవత వరుణడు. గృహ నిర్మాణ సమయంలో తూర్పు వైపు కన్నా పడమటి వైపు తక్కువ స్థలం విడిచిపెట్టాలి, ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఈ భాగంలో కూడా మంచినీటి బావులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్తరం : ఈ దిక్కుకు అధిష్టాన దేవత కుబేరుడు. దక్షిణ దిక్కుకంటే పల్లంగా విశాలంగా ఉండేలా చూసుకోవాలి. ఈ దిక్కున కూడా బోరు తవ్వించవచ్చు.ఈ జాగ్రత్తలు తీసుకుంటే విద్య, ఆదాయం, సం
తెల్ల వెంట్రుకలను పీకేస్తే. అవి రెట్టింపు అవుతాయంటారు.. ఇది వాస్తవమేనా…?
- Get link
- X
- Other Apps
తెల్ల వెంట్రుకలను పీకేస్తే, అవి రెట్టింపు అవుతాయంటారు. ఇది వాస్తవమేనా… ? తెల్లవెంట్రుకలు వస్తున్నాయంటే పెళ్లి కానీ యువతకు భయం ఉంటుంది. పెళ్లి కూడా కాలేదు , అప్పుడే వైయిట్ హెయిర్ వస్తుందని అందరూ ఆటపట్టిస్తూ ఉంటారు. అందుకే వాటిని కవర్ చేయడానికి కలర్ వేయడం , గోరింటాకు పెట్టడం వంటివి చేస్తుంటారు చాలామంది. ఒకప్పుడు వయసు మీదపడితేనే జట్టు నరిసేది. కానీ ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ , ఒత్తిడి , ఇతరత్రా కారణాల వల్ల తక్కువ వయసులోనే వెంట్రుకలు తెల్లబడుతున్నాయి. అయితే జనాల్లో ఒక నమ్మకం బాగా ఉంది . అది ఏంటంటే , తెల్ల వెంట్రుకలను పీకేస్తే ఆ చుట్టూ పక్కల హెయిర్ కూడా తెల్లగా అవుతుందని. చాలామంది వైట్ హెయిర్ పీకేస్తుంటే పక్కన ఉండేవారు ఇదే మాట చెబుతారు. అసలు ఈ విషయం నిజమేనా , దీనిపై నిపుణులు ఏమంటున్నారు . వెంట్రుకలు తలపై ఉన్న రోమ కుదుళ్ల నుంచి మొలుస్తాయి. ఈ కుదుళ్లు ఎపిడెర్మిస్ అని పిలిచే ఉపరితల చర్మం కింద ఉన్న డెర్మిస్ ప్రాంతంలో ఉంటాయి. అక్కడే మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. వైట్ హెయిర్ కు , నల్లవెంట్రుకలకు మధ్య తేడాను నిర్ణయించేది మెలనిన్. తెల్లవెంట్రుకలలో మెలనిన్ ఉండదు. అదే నల్లవెంట్రుకలలో మెలనిన్
ఇది పుతిన్ సైతం ఊహించని పరిణామం, ఉక్రెయిన్ చేష్టలు భేష్ అంటూ…!
- Get link
- X
- Other Apps
ఇది పుతిన్ సైతం ఊహించని పరిణామం , ఉక్రెయిన్ చేష్టలు భేష్ అంటూ…! ఉక్రెయిన్ పరిణామాలను ప్రపంచం ఒకవైపు ఆసక్తిగా గమనిస్తోంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై పాశ్చాత్య దేశాలు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధానికి తహతహలాడుతున్నాడంటూ తిట్టిపోస్తున్నాయి. ఈ తరుణంలో ఊహించని ప్రశంసలు పుతిన్‌పై పడ్డాయి. చేసింది ఎవరో కాదు , అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఉక్రెయిన్ పరిణామాల ఆధారంగా , పుతిన్ మహా మేధావి అంటూ వ్యాఖ్యానించాడు ట్రంప్. రైట్ వింగ్ రేడియో ప్రోగ్రామ్, ది క్లే ట్రావిస్ అండ్ బక్ సెక్స్టాన్ షోలో పాల్గొన్న ట్రంప్, పుతిన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుతిన్ గురించి నాకు బాగా తెలుసు. అతని నాకు మంచి స్నేహితుడు. మహా మేధావి కూడా. ఉక్రెయిన్ లోని డానెట్స్క్, లుహాన్స్క్ లను స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించడం తెలివైన చర్య అంటూ పేర్కొన్నాడు ట్రంప్. ''ఉక్రెయిన్ లోని భారీ భూభాగాన్ని స్వతంత్ర రాజ్యాలుగా పుతిన్ ప్రకటించడాన్ని టీవీలో చూశా. వావ్, అది అద్భుతమైన చర్య అన్నారు. ఆ నిర్ణయం ఎంత తెలివైనదంటే, రెండు స్వతంత్ర రాజ్యాలుగా విడగొట్టి పుతిన్ శ
కార్ల్‌సన్‌ను ఓడించిన యువ సంచలనం ప్రజ్ఞానందకు ప్రధాని మోదీ అభినందనలు
- Get link
- X
- Other Apps
కార్ల్‌సన్‌ను ఓడించిన యువ సంచలనం ప్రజ్ఞానందకు ప్రధాని మోదీ అభినందనలు ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన భారతదేశానికి చెందిన 16 ఏళ్ల కుర్రాడు ఆర్. ప్రజ్ఞానందను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ట్విట్టర్ వేదికగా ప్రజ్ఞానందకు మోదీ అభినందనలు తెలిపారు. "యువ మేధావి ఆర్ ప్రజ్ఞానంద విజయం పట్ల సంతోషిస్తున్నాను. ప్రముఖ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌పై విజయం సాధించినందుకు గర్విస్తున్నాను. ప్రతిభావంతుడైన ప్రజ్ఞానందకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను." అని ప్రధాని నరేంద్ర మోదీ రాసుకొచ్చారు. కాగా ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ టోర్నీలోనే ఐదవ అతిపిన్న వయస్కుడైన 16 ఏళ్ల ప్రజ్ఞానానంద ఎనిమిదో రౌండ్‌లో ప్రపంచ చెస్ నంబర్ వన్ గ్రాండ్‌మాస్టర్ కార్ల్‌సన్‌ను ఓడించి ఆశ్చర్యపరిచాడు. అయితే వరల్డ్ నంబర్ వన్ కార్ల్‌సన్‌ను ఓడించినప్పటికీ ఈ టోర్నీలో ప్రజ్ఞానంద నాకౌట్ పోరుకు అర్హత సాధించలేకపోయాడు. ఈ ఆన్ లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ను 11వ స్థానంతో ముగించాడు. ఈ టోర్నీలో నాకౌట్‌కు అర్హత సాధించాలంటే తొల
మహాశివరాత్రి నాడు ఏ రాశివారు ఏమంత్రం జపించాలో తెలుసా...!
- Get link
- X
- Other Apps
మహాశివరాత్రి నాడు ఏ రాశివారు ఏమంత్రం జపించాలో తెలుసా ...! ఈ ఏడాది మార్చి1వ తేదీ, మంగళవారం వస్తోంది. దేశంలోని హిందువులు మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రధ్ధలతో జరుపుకుంటారు. మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి పర్వదినం భక్తులు లింగరూపంలో ఉన్న శివునికి వివిధ సుగంధ ద్రవ్యాలు , పండ్లరసాలు, వివిధద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తారు. లింగోద్భవ కాలంలో శివ పార్వతుల కళ్యాణం జరుపుతారు. పరమ శివుడ్ని ప్రసన్నం చేసుకోటానికి జ్యోతిష్య శాస్త్రంలో వివిధ మార్గాలు ఉన్నాయని రాజస్థాన్ చిత్తోర్‌ఘడ్ లో ఉన్న కల్లాజీ వేద విశ్వవిద్యాలయం జ్యోతిషశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మృత్యుంజయ్ తివారీ తెలిపారు. మేషాది ద్వాదశ రాశులవారు ఈ క్రింద చెప్పబడిన ఆ రాశికి సూచించిన మంత్రాలతో మహా శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేసుకుంటే శుభం కలుగుతుందని తివారీ తెలిపారు. మేషరాశి : ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివుడిని తమ శక్తికొలదీ పూజించి, "ఓం మమలేశ్వరాయ నమః" అనే మంత్రాన్ని జపిస్తే మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. వృషభం : ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేసి “ఓం నాగేశ్వరాయ నమః” అనే మంత్ర
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం తీసుకోవడం వల్ల…!
- Get link
- X
- Other Apps
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం తీసుకోవడం వల్ల …! ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దాని ప్రయోజనాలు తెలుసుకోండి. బెల్లంలో పోషకాలు 1- విటమిన్ B1 మరియు B6 2- విటమిన్ సి 3- మెగ్నీషియం 4- ఇనుము 5- పొటాషియం 6- కాల్షియం ఉదయం ఖాళీ కడుపుతో బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు బెల్లం కడుపు వ్యాధుల నుండి ఉపశమనం పొందుతుంది - ప్రజల జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల కారణంగా , కడుపు వ్యాధులు పెరుగుతున్నాయి. ప్రతి వ్యక్తి గ్యాస్ , అసిడిటీ , అజీర్ణం మరియు మలబద్ధకం వంటి కడుపు వ్యాధుల సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో , ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో బెల్లం తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు తగ్గడానికి (బరువు తగ్గించడంలో బెల్లం మేలు చేస్తుంది) - మీరు మీ బరువును తగ్గించుకోవాలనుకుంటే , మీరు ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో బెల్లం తినాలి. ఇందులో పొటాషియం , మెగ్నీషియం , విటమిన్ బి 1, బి 6 మరియు విటమిన్ సి ఉంటాయి. దీన్ని ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు నెమ్మదిగా కరిగిపోతుంది. బెల్లం హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది - బెల్లంలో ఐరన్
ఈ రోజు మీ రాశి ఫలాలు: శుక్రవారం 23 అక్టోబర్ 2020 | #Rasi Phalalu today 22 October 2020
- Get link
- X
- Other Apps
ఈ రోజు మీ రాశి ఫలాలు: శుక్రవారం 23 అక్టోబర్ 2020 వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 మేషరాశి ( Aries) అశ్విని , భరణి , కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు సవాలుగా అనిపించవచ్చు. పని భారం ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం వరకు ఉరుకుల పరుగుల మీద పనిచేయాల్సి ఉంటుంది , కానీ అందరి ప్రశంసలు అందుకుంటారు. ఫలితంగా కీర్తి , ధైర్యం పెరుగుతాయి. వీలైనంత వరకు వివాదాలు , తగాదాలకు దూరంగా ఉంటే మంచిది. అనవసర ఖర్చులు చేయకండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి , పశు , పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు , రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి : ఈ రోజు ప్రత్యర్థులు మిమ్మల్ని అధిగమించడానికి ప్రయత్నించవచ్చు. ఈ సమయంలో తెలివితేటలతో వ్యవహరించాలి. తొందరపాటుతో ఎలాంటి పనులు చేయకం
ఈ రోజు మీ రాశి ఫలాలు: గురువారం 22 అక్టోబర్ 2020 | #Rasi Phalalu today 22 October 2020
- Get link
- X
- Other Apps
ఈ రోజు మీ రాశి ఫలాలు: గురువారం 22 అక్టోబర్ 2020 వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 మేషరాశి ( Aries) వారికి: ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేటు వ్యాపారంలో ప్రయోజనం లభిస్తుంది. తండ్రి ఆశీర్వాద బలంతో ప్రభుత్వం గౌరవించే అవకాశముంటుంది. మీరు అందరికీ ఇష్టమైన వారు అవుతారు. తల్లి ఆరోగ్యానికి సంబంధించి సమస్య ఉండవచ్చు. పశు , పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. వృషభరాశి ( Taurus) వారికి: ఈ రోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ఇతరుల వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ఆందోళనలో పడకుండా ఉండండి. మీరు నిర్భయంగా మీ పనులను పూర్తి చేయగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. వీలైనంత వరకు వివాదాలు , తగాదాలకు దూరంగా ఉంటే మంచిది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. మిధునరాశి ( Gemini) వారికి: ఈ రోజు మ