Posts

Showing posts with the label crime news

వీళ్ళెం అమ్మానాన్నలు, కన్న కొడుకుని అమ్ముకుని...!

Image
వీళ్ళెం అమ్మానాన్నలు, కన్న కొడుకుని అమ్ముకుని...! దంపతుల మధ్య వచ్చిన గొడవల కారణంగా కన్నకొడుకునే అమ్ముకుని , ఇద్దరూ వేరు పడి వెళ్లిపోయిన అమానవీయ ఘటన ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా మథిలి మండలం కియాంగ్‌ పంచాయతీ తేలగబేచా గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. అదే గ్రామానికి చెందిన వాసుదేవ్‌ అనే తొమ్మిదేళ్ల బాలుడి తల్లిదండ్రులు రోజూ గొడవలు పడుతుండేవారు. ఇక తమ మధ్య సయోధ్య కుదరదని , విడిపోయి చెరో దారి చూసుకోవాలని నిర్ణయించుకుని, వారి తొమ్మిదేళ్ల బాలుడు వాసుదేవ్‌ను ఓ కుటుంబానికి అమ్మేసి వెళ్లిపోయారు. బాలుడిని కొనుకున్న యజమాని వాసుదేవ్‌ను పశువుల కాపలాకు పంపించేవాడు.   వెళ్లలేనంటే కొడుతుండేవారు. భోజనం కూడా అప్పుడప్పుడే. చిత్రహింసలు మితిమీరడంతో భరించలేకపోయిన బాలుడు అక్కడ నుంచి తప్పించుకుని సలపదర్‌ అనే గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ కొంతమంది గ్రామస్థులు వాసుదేవ్‌ పరిస్థితి చూసి అంగన్‌వాడీ కేంద్రానికి అప్పగించారు. బాలుడి నేపథ్యం తెలుసుకున్న అంగన్‌వాడీ కార్యకర్త జయంతి ఖోరా, వాసుదేవ్‌ని ఇంటికి తీసుకెళ్లి సంరక్షిస్తోంది. బాలుడిని కొన్న వ్యక్తి నుంచి జయంతికి బెదిరింపులు వచ్చినా గ్రామస్థుల సహకారంతో ...

గడ్డం గీసినందుకు 20 తక్కువ ఇచ్చాడని హత్య చేశాడు...!

Image
  దుకాణాలు పెట్టుకున్నవారికి ఎంత ఓపిక ఉండాలి. కొందరు కష్టమర్లు డబ్బులు లేకుండా వచ్చినప్పుడు కాస్త ముఖం చూసి కష్టమర్లను కాపాడుకోవాలి. అంతేగానీ కష్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే వారు వేరే షాపు చూసుకుంటారు. అయితే ఓ బార్బర్ షాపు అతను మాత్రం కేవలం రూ.20 కోసం కష్టమర్ ప్రాణాలు తీశాడు. షేవింగ్ చేయించుకుని ఇరవై రూపాయలు తక్కువ ఇచ్చాడు. అవి ఇప్పుడే ఇవ్వాలని బార్బర్ షాపు అతను అడిగాడు. అతను తర్వాత ఇస్తానని చెప్పినా వినకుండా కర్రలతో కొట్టి అతన్ని హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఈ నెల 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బురారీ ప్రాంతంలో నివాసం ఉండే రూపేశ్‌ అనే వ్యక్తి స్థానికంగా ఉండే బార్బర్‌ దుకాణానికి క్షవరం చేయించుకోడానికి వెళ్లాడు. షేవింగ్ చేసుకున్నాక రూ.50 ఇవ్వమని షేవింగ్ చేసిన సంతోష్, రూపేష్‌ను అడిగారు. అందుకు రూపేశ్‌ రూ.30 ఇచ్చి మిగతా రూ.20 తర్వాత ఇస్తానని చెప్పాడు. అయితే మిగతా రూ.20 కూడా వెంటనే ఇవ్వాలని సంతోష్ అతని సోదరుడు సరోజ్‌పట్టుబట్టారు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. విచక్షణ కోల్పోయిన ఇద్దరు సోదరులు రూపేశ్‌ను కర్ర...