వీళ్ళెం అమ్మానాన్నలు, కన్న కొడుకుని అమ్ముకుని...!
వీళ్ళెం అమ్మానాన్నలు, కన్న కొడుకుని అమ్ముకుని...! దంపతుల మధ్య వచ్చిన గొడవల కారణంగా కన్నకొడుకునే అమ్ముకుని , ఇద్దరూ వేరు పడి వెళ్లిపోయిన అమానవీయ ఘటన ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా మథిలి మండలం కియాంగ్ పంచాయతీ తేలగబేచా గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. అదే గ్రామానికి చెందిన వాసుదేవ్ అనే తొమ్మిదేళ్ల బాలుడి తల్లిదండ్రులు రోజూ గొడవలు పడుతుండేవారు. ఇక తమ మధ్య సయోధ్య కుదరదని , విడిపోయి చెరో దారి చూసుకోవాలని నిర్ణయించుకుని, వారి తొమ్మిదేళ్ల బాలుడు వాసుదేవ్‌ను ఓ కుటుంబానికి అమ్మేసి వెళ్లిపోయారు. బాలుడిని కొనుకున్న యజమాని వాసుదేవ్‌ను పశువుల కాపలాకు పంపించేవాడు. వెళ్లలేనంటే కొడుతుండేవారు. భోజనం కూడా అప్పుడప్పుడే. చిత్రహింసలు మితిమీరడంతో భరించలేకపోయిన బాలుడు అక్కడ నుంచి తప్పించుకుని సలపదర్ అనే గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ కొంతమంది గ్రామస్థులు వాసుదేవ్ పరిస్థితి చూసి అంగన్‌వాడీ కేంద్రానికి అప్పగించారు. బాలుడి నేపథ్యం తెలుసుకున్న అంగన్‌వాడీ కార్యకర్త జయంతి ఖోరా, వాసుదేవ్‌ని ఇంటికి తీసుకెళ్లి సంరక్షిస్తోంది. బాలుడిని కొన్న వ్యక్తి నుంచి జయంతికి బెదిరింపులు వచ్చినా గ్రామస్థుల సహకారంతో ఉన్న