Posts

Showing posts with the label ysrcp

వైసీపీలోకి నాదెండ్ల మనోహర్...!

Image
  ఇప్పటికే వరుస వరుసగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ లు మీద షాక్ లు తగులుతున్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు బీజేపి పవన్ తో పొత్తు తెగ తెంపులు చేసుకోకపోయినా , చేసుకున్నట్టుగానే వ్యవహరిస్తోంది. ఏ విషయంలోనూ కలుపుకుని వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో పవన్ ఒంటరిగా ముందుకు వెళ్ళలేక , ఇష్టం లేకపోయినా బీజేపి తోనే ముందుకు అడుగులు వేసేందుకు పవన్ సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా , జనసేన పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉంటూ వస్తున్న ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జి నాదెండ్ల మనోహర్ ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారనే వార్తలు పెద్దఎత్తున వస్తున్నాయి.   గత కొంతకాలంగా ఆయన జనసేన పార్టీలో ఇమడలేక పోతున్నారని , తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైసీపీతో అడుగులు వేస్తే ఫలితం ఉంటుందనే అభిప్రాయంతో , ఆ పార్టీ వైపు చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.   నాదెండ్ల మనోహర్ కు జనసేన పార్టీలో ప్రాధాన్యం ఎక్కువగానే ఉంటూ వస్తోంది. పవన్ ఏ పర్యటనకు వెళ్లినా , పక్కన నాదెండ్ల ఉంటారు. పవన్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా , దాంట్లో ఆయన పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. అంతగా ఆయనకు ఆ పార్టీలో ప్రాధాన్

అంతర్వేది ఘటనలో ట్విస్ట్: సీనియర్ ఐఎఎస్ అధికారిపై బదిలీ వేటు

Image
అంతర్వేది ఘటనలో ట్విస్ట్: సీనియర్ ఐఎఎస్ అధికారిపై బదిలీ వేటు తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలంలోని అంతర్వేదిలో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథం మంటల బారిన పడిన ఘటన సరికొత్త మలుపు తిరిగింది. దీనిపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఘాటు విమర్శలతో చెలరేగిపోతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ అసంతృప్తి గళం వినిపిస్తోంది. ఈ వ్యతిరేకతను చల్లార్చడానికి ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలేవీ పెద్దగా ఫలించినట్లు కనిపించట్లేదు.   ఈ పరిణామాల మధ్య ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.   సీనియర్ ఐఎఎస్ అధికారిపై బదిలీ వేటు వేసింది. అంతర్వేది దేవాస్థానం కార్యనిర్వహణాధికారినీ విధుల నుంచి తప్పించింది. ప్రాధాన్యత లేని విభాగానికి పంపించింది. రెవెన్యూ (దేవాదాయం) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఉత్తర్వులను జారీ చేశారు.   దేవాదాయ శాఖ ప్ర