మైనర్ వివాహాల కలకలం...

పశ్చిమ గోదావరి జిల్లాలో మైనర్ వివాహాలు కలకలం రేపాయి. జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం పాములవారిగూడెం గ్రామానికి చెందిన మైనర్ బాలుడు, మైనర్ బాలిక మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. బాలిక గర్భం దాల్చడంతో రాత్రి వారిద్దరికీ గ్రామ పెద్దలు వివాహం చేసారు. సరిగ్గా అలాగే మరో మైనర్ బాలుడికి, మరో మైనర్ బాలికకు కూడా ఈ రోజు ఉదయం వివాహం చేసేందుకు స్థానిక పెద్దలు యత్నించారు. సమాచారం రావడంతో పెళ్ళిని పోలీసులు అడ్డుకున్నారు. మైనర్లతో పాటు, వారి తల్లిదండ్రులను స్టేషన్ కు తరలించారు. అయితే... రెండు సంఘటనల్లోనూ మైనర్ బాలురు ఇద్దరూ అన్నదమ్ములు కావడం గమనార్హం.