గూగుల్ పిక్సల్ 4ఏ, పిక్సెల్ 5 మొబైల్స్…!
గూగుల్ పిక్సల్ 4 ఏ , పిక్సెల్ 5 మొబైల్స్… ! గూగుల్ సంస్థ రెండు మొబైల్ ఫోన్స్ ను తాజాగా తీసుకుని వచ్చింది. పిక్సల్ 4 ఏలో 5 జీ వర్షన్ ను , పిక్సెల్ 5 పేరిట రెండు వేరియంట్లను సంస్థ విడుదల చేసింది. స్నాప్ డ్రాగన్ 765 జీ ప్రాసెసర్ తో పాటూ దీనికి రక్షణగా టైటాన్ ఎం సెక్యూరిటీ చిప్ ఉంటుందని సంస్థ తెలిపింది. గూగుల్ పిక్సెల్ 5 ను 2020 లో ఫ్లాగ్ షిప్ ఫోన్ గా గూగుల్ చెబుతోంది. పిక్సల్ 4 ఏ , పిక్సెల్ 5 రెండు మొబైల్స్ లో కూడా డ్యూయల్ రియర్ కెమెరాలు ఉండనున్నాయి. 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉండనుంది. అలాగే హోల్ పంచ్ డిజైన్ తో రాబోతోంది. ఎక్స్స్ట్రీమ్ బ్యాటరీ సేవర్ మోడ్ ను ఈ మొబైల్స్ లో తీసుకుని వచ్చారు. దీని ద్వారా బ్యాటరీ లైఫ్ 48 గంటల వరకు పెంచవచ్చు. అలాగే పోట్రైట్ లైట్ ఫీచర్ కూడా ఉంది. పిక్సెల్ 5 లో వైర్ లెస్ ఛార్జింగ్ కలదు. అల్యూమినం బాడీతో ఐపీ 68 సర్టిఫైడ్ తో డస్ట్ , వాటర్ రెసిస్టెంట్ కెపాసిటీ ఉంది. ఈ ఫోన్ల స్పెసిఫికేషన్స్: గూగుల్ పిక్సెల్ 4 ఏ 5 జీ: డ్యూయల్ సిమ్ (నాన్ ప్లస్ ఈ-సిమ్) , ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ , ఫుల్ హెచ్డీ 6.2 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే , కార్నింగ్ గ