Posts

Showing posts with the label nadendla manohar

వైసీపీలోకి నాదెండ్ల మనోహర్...!

Image
  ఇప్పటికే వరుస వరుసగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ లు మీద షాక్ లు తగులుతున్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు బీజేపి పవన్ తో పొత్తు తెగ తెంపులు చేసుకోకపోయినా , చేసుకున్నట్టుగానే వ్యవహరిస్తోంది. ఏ విషయంలోనూ కలుపుకుని వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో పవన్ ఒంటరిగా ముందుకు వెళ్ళలేక , ఇష్టం లేకపోయినా బీజేపి తోనే ముందుకు అడుగులు వేసేందుకు పవన్ సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా , జనసేన పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉంటూ వస్తున్న ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జి నాదెండ్ల మనోహర్ ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారనే వార్తలు పెద్దఎత్తున వస్తున్నాయి.   గత కొంతకాలంగా ఆయన జనసేన పార్టీలో ఇమడలేక పోతున్నారని , తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైసీపీతో అడుగులు వేస్తే ఫలితం ఉంటుందనే అభిప్రాయంతో , ఆ పార్టీ వైపు చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.   నాదెండ్ల మనోహర్ కు జనసేన పార్టీలో ప్రాధాన్యం ఎక్కువగానే ఉంటూ వస్తోంది. పవన్ ఏ పర్యటనకు వెళ్లినా , పక్కన నాదెండ్ల ఉంటారు. పవన్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా , దాంట్లో ఆయన పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. అంతగా ఆయనకు ఆ పార...