శరన్నవరాత్రుల పూజా విధానం…! #Navaratrula puja vidhanam
వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 శరన్నవరాత్రుల పూజా విధానం , తప్పక తెలుసుకోవాల్సినవి శ్రీదేవీ శరన్నవరాత్రులు ప్రారంభించే ముందు రోజునాటికే పూజాసామగ్రి , పూజాద్రవ్యాలు , హోమద్రవ్యాలు సిద్దం చేసుకోవాలి. పూజామందిరంలో 9 అంగుళాలు ఎత్తుగల పీరాన్ని ఏర్పరచుకొని , పీఠముపై ఎర్రని వస్త్రము పరచి , బియ్యము పోసి , దానిపై సువర్ణ , రజిత , లేదా తామ్రా కలశమును ఉంచి , కలశమునకు దారములు చుట్టి , కలశములో పరిశుద్ద నదీజలములను నింపి , అందు లవంగములు , యాలకులు , జాజికాయ , పచ్చ కర్పూరము మొదలగు సువర్ణ ద్రవ్యాలు వేసి , నవరత్నాలు , పంచలోహాలను వేసి , పసుపు , కుంకుమ , రక్తచందన , చందనాదులను వేసి , మామిడి , మారేడు , మోదుగ , మర్రి , జమ్మి చిగుళ్ళను ఉంచి , పరిమళ పుష్పాదులను వేసి , దానిపై పీచు తీయని , ముచ్చిక కలిగిన టెంకాయనుంచి , దానిపై ఎర్రని చీర , రవిక వేసి , కలశమును చందన , కుంకుమ , పుష్ప