Posts

Showing posts with the label navaratrulu

శరన్నవరాత్రుల పూజా విధానం…! #Navaratrula puja vidhanam

Image
వివరణ :   డా .  యం .  ఎన్ .  చార్య ,  ప్రముఖ   అంతర్జాతీయ   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   శాస్త్ర   పండితులు ,   శ్రీమన్నారాయణ   ఉపాసకులు ,  సునంద   రాజన్   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   కేంద్రం .  తార్నాక ,  హైదరాబాద్ .  ఫోన్ : 9440611151 శరన్నవరాత్రుల పూజా విధానం ,  తప్పక తెలుసుకోవాల్సినవి శ్రీదేవీ శరన్నవరాత్రులు ప్రారంభించే ముందు రోజునాటికే పూజాసామగ్రి ,  పూజాద్రవ్యాలు ,  హోమద్రవ్యాలు సిద్దం చేసుకోవాలి. పూజామందిరంలో  9  అంగుళాలు ఎత్తుగల పీరాన్ని ఏర్పరచుకొని ,  పీఠముపై ఎర్రని వస్త్రము పరచి ,  బియ్యము పోసి ,  దానిపై సువర్ణ ,  రజిత ,  లేదా తామ్రా కలశమును ఉంచి ,  కలశమునకు దారములు చుట్టి ,  కలశములో పరిశుద్ద నదీజలములను నింపి ,  అందు లవంగములు ,  యాలకులు ,  జాజికాయ ,  పచ్చ కర్పూరము మొదలగు సువర్ణ ద్రవ్యాలు వేసి ,  నవరత్నాలు ,  పంచలోహాలను వేసి ,  పసుపు ,  కుంకుమ ,  రక్తచందన ,  చందనాదులను వేసి ,  మామిడి ,  మారేడు ,  మోదుగ ,  మర్రి ,  జమ్మి చిగుళ్ళను ఉంచి ,  పరిమళ పుష్పాదులను వేసి ,  దానిపై పీచు తీయని ,  ముచ్చిక కలిగిన టెంకాయనుంచి ,  దానిపై ఎర్రని చీర ,  రవిక వేసి ,  కలశమును చందన ,  కుంకుమ ,  పుష్ప