Posts

Showing posts with the label war

ఇది పుతిన్‌ సైతం ఊహించని పరిణామం, ఉక్రెయిన్‌ చేష్టలు భేష్‌ అంటూ…!

Image
  ఇది పుతిన్‌ సైతం ఊహించని పరిణామం , ఉక్రెయిన్‌ చేష్టలు భేష్‌ అంటూ…! ఉక్రెయిన్‌ పరిణామాలను ప్రపంచం ఒకవైపు ఆసక్తిగా గమనిస్తోంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై పాశ్చాత్య దేశాలు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధానికి తహతహలాడుతున్నాడంటూ తిట్టిపోస్తున్నాయి. ఈ తరుణంలో ఊహించని ప్రశంసలు పుతిన్‌పై పడ్డాయి. చేసింది ఎవరో కాదు , అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఉక్రెయిన్‌ పరిణామాల ఆధారంగా , పుతిన్ మహా మేధావి అంటూ వ్యాఖ్యానించాడు ట్రంప్‌. రైట్‌ వింగ్‌ రేడియో ప్రోగ్రామ్‌, ది క్లే ట్రావిస్ అండ్ బక్ సెక్స్టాన్ షోలో పాల్గొన్న ట్రంప్‌, పుతిన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుతిన్‌ గురించి నాకు బాగా తెలుసు. అతని నాకు మంచి స్నేహితుడు. మహా మేధావి కూడా. ఉక్రెయిన్ లోని డానెట్స్క్, లుహాన్స్క్ లను స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించడం తెలివైన చర్య అంటూ పేర్కొన్నాడు ట్రంప్‌. ''ఉక్రెయిన్ లోని భారీ భూభాగాన్ని స్వతంత్ర రాజ్యాలుగా పుతిన్ ప్రకటించడాన్ని టీవీలో చూశా. వావ్‌, అది అద్భుతమైన చర్య అన్నారు. ఆ నిర్ణయం ఎంత తెలివైనదంటే, రెండు స్వతంత్ర రాజ్యాలుగా విడగొట్టి పుతిన్ శ

యుద్ధభేరి మోగించినట్టు సంకేతాలు…! | China started war on Taiwan

Image
యుద్ధభేరి మోగించినట్టు సంకేతాలు …! తైవాన్‌పై సైనిక చర్యకు చైనా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సరిహద్దులకు భారీ స్థాయిలో బలగాలను, ఆయుధాలను తరలించినట్లు సమాచారం. చైనా ప్రభుత్వం అత్యాధునిక డీఎఫ్-17 క్షిపణులను కూడా మోహరించింది. తైవాన్ తమ అంతర్భాగమేనని చెబుతున్న చైనా, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆ చిన్న భూభాగంపై యుద్ధభేరి మోగించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. మరింత కవ్వించే రీతిలో ఇటీవలే చైనాకు చెందిన 40 యుద్ధ విమనాలు తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. ఇటీవల గ్వాన్‌డాంగ్‌లోని సైనిక స్థావరాన్ని సందర్శించిన అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. సైనికులంతా తమ దృష్టిని యుద్ధ సన్నద్దతపైనే ఉంచాలని పిలుపునిచ్చారు. నిత్యం అప్రమ్తతంగా ఉండాలని ఆదేశించారు. సైనిక స్థావరాల విస్తరణ ,  జిన్‌పింగ్‌ ప్రకటన బట్టి చూస్తే తైవాన్‌పై చైనా దాడి చేసేందుకు సిద్ధమవుతోందన్న ఊహాగానాలకు బలం చేకూరుతుంది. చైనాతో యుద్ధానికి తైవాన్ సిద్ధంగా ఉండాలని అమెరికా రక్షణ వర్గాలు సూచించాయి. అయితే తైవాన్‌పై దాడి చేయడం చైనాకు అంత సులభమేమీ కాదని ,  చైనా తన సేనలను తైవాన్‌పైకి నడిపే ముందు ఓసారి అమెరికా వైఖరిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంద

చైనాతో మరోమారు యుద్ధం తప్పదా…!

Image
చైనాతో మరోమారు యుద్ధం తప్పదా …!   సరిహద్దు సమస్య చర్చల ద్వారా పరిష్కారం అయ్యే సూచనలు కనుచూపుమేరలో కనిపించని నేపథ్యంలో చైనా భారత్ పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతున్న సూచనలు కనబడుతున్నాయి. అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణులతో సహా భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించి పలు క్షిపణులను భారత్ చైనాతో సరిహద్దుల్లో మోహరించింది. దీనికి ప్రతిగా చైనా కూడా రెండు వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను మోహరించింది. రెండుదేశాల సన్నాహకాలను చూస్తుంటే సమీప భవిష్యత్తులో ఇరుదేశాలూ యుద్దానికి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోందని రక్షణరంగ నిపుణులు పేర్కొంటున్నారు. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా భారత్ , చైనాలు తమ తమ సరిహద్దుల రక్షణ కోసం , ప్రత్యర్థి దేశంపై దాడి కోసం ఆధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నాయి.  2 వేల కి.మీల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను , భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను జిన్‌జియాంగ్ , టిబెట్‌ ప్రాంతాల్లో చైనా మోహరించింది. ప్రతిగా బ్రహ్మోస్ , నిర్భయ్ , భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల ఆకాశ్‌ క్షిపణులను భారత్‌ సిద్ధం చేసింది.   భారత్ సేకరించిన క్షిపణుల్లో బ్రహ్మో