బతుకమ్మ పండుగ కథ Story of Bathukamma festival
బతుకమ్మ పండుగ కథ వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో బతుకమ్మను పేర్చి అలంకరించి స్త్రీలు , యువతులు అందమైన వస్త్రాలు ధరించి రంగు రంగుల గాజులను చేతికి ధరించి బతుకమ్మ చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయాకారంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ , సద్దుల బతుకమ్మ. ఇలా దేని ప్రత్యేకత దానిదే. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను చెరువులో లేదా నీటి నదీ ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు , ప్రేమ , స్నేహం , బంధుత్వం , ఆప్యాయతలు , భక్తి , భయం , చరిత్ర , పురాణాలు మేళవిస్తారు. బతుకమ్మ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ , తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా