స్వీట్లకూ ఎక్స్‌పైరీ డేట్ ఉండాల్సిందే…!
స్వీట్లకూ ఎక్స్‌పైరీ డేట్ ఉండాల్సిందే…!
కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో పరిశుభ్రత, ఆహార భద్రతపై శ్రద్ధ పెరిగింది.
ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్న స్పృహవచ్చింది.
దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కొత్త
నిబంధనలతో ముందుకొచ్చింది. ప్యాకేజీ లేని వస్తువులు, లూస్ స్వీట్లకు కూడా ఎక్స్‌పైరీ డేట్ పేర్కొనాల్సిందేనని
వ్యాపారులను ఆదేశించింది.
నేటి నుంచి (అక్టోబర్ 1) ఉత్తర్వులు అమలు చేయాలని స్వీట్‌షాప్
యజమానులకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. అన్ని
ప్యాకేజీ లేని వస్తువులు, లూస్
స్వీట్లు, వాటిని తీసుకెళ్లే ట్రేలు, కంటైనర్లపై ఉత్పత్తి తయారీ తేదీ, గడువు తేదీ పేర్కొనడం తప్పనిసరి. దీపావళి, దసరా సీజన్‌లో స్వీట్లు, ఇతర ఆహార ఉత్పత్తులు ఎక్కువగా
అమ్ముడుపోతాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. అలాగే, పాలు, పాల ఉత్పత్తులను తయారు చేసిన
రెండు రోజులలోపు వాడేయాలని పేర్కొంది. లడ్డూలు, కోవాలాంటి స్వీట్లను నాలుగు రోజుల వరకు ఉంచవచ్చని తెలిపింది. వీటి
తయారీకి వాడే ఎడిబుల్ ఆయిల్స్‌లో ఆవనూనె కలుపొద్దని పేర్కొంది. నిబంధనలు
అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Comments