చైనాతో మరోమారు యుద్ధం తప్పదా…!
చైనాతో మరోమారు యుద్ధం తప్పదా …! సరిహద్దు సమస్య చర్చల ద్వారా పరిష్కారం అయ్యే సూచనలు కనుచూపుమేరలో కనిపించని నేపథ్యంలో చైనా భారత్ పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతున్న సూచనలు కనబడుతున్నాయి. అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణులతో సహా భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించి పలు క్షిపణులను భారత్ చైనాతో సరిహద్దుల్లో మోహరించింది. దీనికి ప్రతిగా చైనా కూడా రెండు వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను మోహరించింది. రెండుదేశాల సన్నాహకాలను చూస్తుంటే సమీప భవిష్యత్తులో ఇరుదేశాలూ యుద్దానికి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోందని రక్షణరంగ నిపుణులు పేర్కొంటున్నారు. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా భారత్ , చైనాలు తమ తమ సరిహద్దుల రక్షణ కోసం , ప్రత్యర్థి దేశంపై దాడి కోసం ఆధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నాయి. 2 వేల కి.మీల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను , భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను జిన్‌జియాంగ్ , టిబెట్ ప్రాంతాల్లో చైనా మోహరించింది. ప్రతిగా బ్రహ్మోస్ , నిర్భయ్ , భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల ఆకాశ్ క్షిపణులను భారత్ సిద్ధం చేసింది. భారత్ సేకరించిన క్షిప...