Posts

Showing posts with the label dussera

ఈ రోజు నుండి దేవి 'త్రిరాత్ర' వ్రతం ప్రారంభం | Tri ratra vratham starts

Image
ఈ రోజు నుండి దేవి ' త్రిరాత్ర ' వ్రతం ప్రారంభం వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం నవరూప ధరాం శక్తిం , నవదుర్గాముపాశ్రయే జగజ్జనని అయిన అమ్మవారి దయతోనే సర్వ జగత్తూ నడయాడుతోంది. ఆ అమ్మ కరుణా పారీణ. ఆ తల్లి అమృతహృదయ. ఆమె చల్లని చూపులకోసం అఖిలాండాలు ఎదురు చూస్తుంటాయ. అందుకే ఆరాధించడానికి తిథి వార నక్షత్రాలు లేకపోయినా ఈ ఆశ్వీయుజమాసాన వచ్చే శుద్ధ పాడమి మొదలుకుని నవమి వరకు ఆ తల్లిని కొలిచినవారికి కోటిజన్మలలోని పాపరాశి భస్మమవడమే కాదు తుదిలేని పుణ్యరాశి లభ్యవౌతుందట. అందుకే సజ్జను లందరూ ఈ జగాలనేలే జగన్మాత వ్రతాన్ని ఆచరించడానికి వేయ్యి కనులతో ఎదురు చూస్తుంటారని , అలా చూసి అమ్మ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయని దేవీభాగవతం చెబుతోంది. ఈ వ్రతరాజాన్నే దుర్గాదేవి వ్రతమని , కుమారీ పూజ అనీ అంటారు. ఈ చల్లని తల్లిని మనలోని తిమిరాంధకారాన్ని పారద్రోలమని రాత్రివే...

2020 సంవత్సరంలో దసరా పండగ ఎప్పుడు…! | Vijaya Dashami in 2020

Image
2020 సంవత్సరంలో దసరా పండగ ఎప్పుడు …! వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 విజయదశమి అంటే ఆరోజు సూర్యోదయానికి శ్రవణ నక్షత్రం ఉండాలి. శ్రవణ నక్షత్రానికి అధిదేవత విష్ణువు. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది. శమీ చెట్టు యొక్క పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజా స్థలంలో , ధన స్థానంలో నగదు గల్ల పెట్టెల్లో పెట్టుకుంటారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది. నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు , తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ...

శరన్నవరాత్రుల పూజా విధానం…! #Navaratrula puja vidhanam

Image
వివరణ :   డా .  యం .  ఎన్ .  చార్య ,  ప్రముఖ   అంతర్జాతీయ   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   శాస్త్ర   పండితులు ,   శ్రీమన్నారాయణ   ఉపాసకులు ,  సునంద   రాజన్   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   కేంద్రం .  తార్నాక ,  హైదరాబాద్ .  ఫోన్ : 9440611151 శరన్నవరాత్రుల పూజా విధానం ,  తప్పక తెలుసుకోవాల్సినవి శ్రీదేవీ శరన్నవరాత్రులు ప్రారంభించే ముందు రోజునాటికే పూజాసామగ్రి ,  పూజాద్రవ్యాలు ,  హోమద్రవ్యాలు సిద్దం చేసుకోవాలి. పూజామందిరంలో  9  అంగుళాలు ఎత్తుగల పీరాన్ని ఏర్పరచుకొని ,  పీఠముపై ఎర్రని వస్త్రము పరచి ,  బియ్యము పోసి ,  దానిపై సువర్ణ ,  రజిత ,  లేదా తామ్రా కలశమును ఉంచి ,  కలశమునకు దారములు చుట్టి ,  కలశములో పరిశుద్ద నదీజలములను నింపి ,  అందు లవంగములు ,  యాలకులు ,  జాజికాయ ,  పచ్చ కర్పూరము మొదలగు సువర్ణ ద్రవ్యాలు వేసి ,  నవరత్నాలు ,  పంచలోహాలను వేసి ,  పసుపు ,  కుంకుమ ,  రక్తచందన ,  చందన...