Posts

Showing posts with the label cover

నీళ్ళలో మునిగిన వాహనాల గతి ఏమిటి...! భీమా వర్తిస్తుందా...! #car insurance

Image
  నీళ్ళలో మునిగిన వాహనాల గతి ఏమిటి...! భీమా వర్తిస్తుందా...!   కురిసింది చిన్నవాన కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వరదలు నదుల్లా పొంగాయి. రోడ్డు మీదున్న కార్లు , లారీలు , బస్సులు కూడా కొట్టుకెళ్లిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోనైతే వాహనాలు కనిపించకుండా మునిగిపోయాయి. కొన్ని వాహనాలు చిన్న రిపేర్లతో బయటపడితే , మరికొన్ని వాహనాలకు మాత్రం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. దీంతో యజమానులు ఇన్సూరెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని , ఎంత వరకు కవరేజీ ఉన్నదో చూసుకున్నాకే దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  ' వాహనాల ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ దరఖాస్తులు క్రమంగా పెరుగుతున్నాయి. వరద పూర్తిగా తగ్గిపోయి , అన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ పూర్తైతే దరఖాస్తుల సంఖ్య ఇంకా ఎక్కువవుతుంది ' అని బజాజ్‌ అలియాంజ్‌ ఇన్సూరెన్స్‌ మోటర్‌ ఓడీ క్లెయిమ్స్‌ హెడ్‌ పద్మనాభ చెప్పారు. ఇంజిన్‌కు సైతం రక్షణ కల్పించే పాలసీని కట్టినవారికి మాత్రమే ఊరట కలుగుతుందని ఆయన చెప్పారు. ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ లేకున్నా , ఇత...