దుబ్బాకలో దూసుకుపోతున్న కత్తి కార్తికపై చీటింగ్ కేసు...!#kathi karthika
యాంకర్ , దుబ్బాకలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆమెపై బాధితుడు ఫిర్యాదు చేశాడు. భూ వివాదంలో సెటిల్‌మెంట్ చేస్తానంటూ మోసం చేసినట్టు కత్తి కార్తీకపై ఆరోపణలు వచ్చాయి. అమీన్‌పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఓ ప్రైవేటు కంపెనీకి ఇప్పించేందుకు మధ్యవర్తిత్వం చేసినట్టు బాధితుడు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కార్తీక , అనుచరులు కోటి రూపాయలు డిపాజిట్ చేయించుకుందని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కత్తి కార్తీక , తన సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట ఇండిపెండెంట్ అభ్యర్థిగా దుబ్బాక ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి ఆ తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తనను గెలిపించాలని ఆమె కోరుతున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని. దుబ్బాక లో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు...