టీఆర్‌ఎస్ కుట్రలను ఛేదిస్తాం
టీఆర్‌ఎస్ కుట్రలను ఛేదిస్తాం రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బోగస్ ఓట్లతో, అక్రమ డీలిమిటేషన్ ప్రక్రియతో గెలవాలని అధికార టీఆర్‌ఎస్ కుట్రలు చేస్తోందని, కాంగ్రెస్ నాయకులు అప్రమతంగా ఉండాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ కుట్రలను ఛేదించి గ్రేటర్ ఎన్నికల్లో విజ యం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఇందిరాభవన్‌లో గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ నగరంలో బోగస్ ఓట్లను చేర్పించి లబ్ధి పొందాలని టీఆర్‌ఎస్ యత్నిస్తోందని, ఒక్కో డివిజన్‌లో ఒక్కో రకంగా ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు. డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా నగర కాంగ్రెస్ నాయకులు పోరాటం చేయాలని కోరారు. 150 డివిజన్లలో కాంగ్రెస్ కమిటీలతో పాటు అనుబంధ సంఘాల కమిటీలను పూర్తి చేయాలని, నాయకులు గడప గడపకూ తిరిగి ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ పాలన పట్ల ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని, ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ విజయం ఖాయమని అన్నారు. మల్కాజిగిరి ఎంపీ...