Posts

Showing posts with the label human life

అనేకత్వం నుంచి ఏకత్వంలోకి…!

Image
అనేకత్వం నుంచి ఏకత్వంలోకి …! వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151   మనం ఈ లోకంలోకి ఎందుకొచ్చామని ప్రశ్నించుకుంటే … ఎవరినుంచీ ఏ మార్గంలోనూ సమాధానం దొరకదు. ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో తప్ఫ . జీవితం రూపంలో లభ్యమైన ఇంత అమూల్యమైన ప్రయాణాన్ని ఇంత అర్థంలేని , ఇంత చవిలేని , ఇంత నిరర్థకమైన గమ్యం కోసమే చేశామని అర్థమై , వచ్చిన దారివైపు , ఆ చివర మొదలు పెట్టిన స్థానంవైపు చూస్తే … ఎంత అనాలోచితంగా , ఇంత అలవోకగా చేశామేమిటని మన అజ్ఞానానికి మనమే సిగ్గుపడతాం.   ఒక పనిని లేదా కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు తగినదాన్ని ఎన్నుకునే అవకాశం చాలావరకు మనకుంది. అల్లాటప్పా పని కాకుండా అమూల్యమైనదాన్ని , మన శ్రమకు తగిన ఫలితం ఇవ్వగలిగేదాన్ని ఎన్నుకోవాలి. మానవ జన్మ మనం ఎన్నుకున్నది కాకపోయినా (నిజానికి లోతుగా ఆలోచిస్తే అది మనం ఎన్నుకున్నదే. కర్మ ఫలాల ఫలితంగా) దాన్ని ఎలా జీవించాలనే విషయం , దేనికి ఉపయోగించుకోవాలనే విషయం , నిర్ణయం...