గూగుల్ భవిష్యత్తులో విడుదల చేసే మోడళ్లలో ఈ సరికొత్త 'హోల్డ్ ఫర్ మీ’
గూగుల్ భవిష్యత్తులో విడుదల చేసే మోడళ్లలో ఈ సరికొత్త ' హోల్డ్ ఫర్ మీ ’ సాంకేతికత ఇంతలా అభివృద్ధి చెందని కొత్తలో , మనకు ఎలాంటి సాయం కావాలన్నా సంస్థల టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసేవాళ్లం. మనకు అవసరమైన సమాచారాన్ని ఆయా సంస్థల కస్టమర్ ఏజెంట్లు అందించే వరకు మన కాల్‌ను చాలా సేపు హోల్డ్‌లో పెట్టేవారు. సెల్‌ఫోన్ నెట్‌వర్క్ కంపెనీల కస్టమర్ కేర్ సెంటర్లకు కాల్ చేస్తే గంటల కొద్దీ కాల్ హోల్డ్‌లో పెట్టేవారు. ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు లేకుండా గూగుల్ కొత్త కాల్ అప్‌డేట్‌ను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఇప్పుడు కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ కాల్స్‌ను గూగుల్ సాయంలో మనం కూడా హోల్డ్‌లో పెట్టొచ్చు. గూగుల్ భవిష్యత్తులో విడుదల చేసే మోడళ్లలో ఈ సరికొత్త ' హోల్డ్ ఫర్ మీ ' ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. కస్టమర్ సపోర్ట్ ప్రతినిధి స్పందన కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా , వినియోగదారుల సమయం వృథా కాకుండా గూగుల్ ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేసింది. అమెరికాలో గూగుల్ విడుదల చేసిన పిక్సెల్ 5, పిక్సెల్ 4 ఎ 5 జి స్మార్ట్‌ఫోన్‌ల కోసం ' హోల్డ్ ఫర్ మీ ' ప్రివ్యూ ఫీచర్‌ను ప్రకటించింది. దీని పనితీరు గుర...