థమ్సప్ బాటిల్‌లో కప్ప...!

జిల్లాలోని యాచారం మండలం మేడిపల్లిలో థమ్సప్ బాటిల్‌లో కప్ప కలకలం సృష్టించింది. మేడిపల్లిలోని మణి కిరాణం షాప్‌లో ఉన్న థమ్సప్ బాటిల్‌లో షాప్ యజమానికి కప్ప కనబడింది. దీంతో ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది వరకు థమ్సప్ బాటిల్స్‌లో పురుగులు, బల్లులు ఉండటం చూశాం. కానీ కప్ప ఉండటం మాత్రం ఇదే తొలిసారి. జాగ్రత్తగా గమనించండి.