వాట్సాప్‌ను వణికిస్తున్న 'టెక్ట్స్ బాంబ్స్'
సంక్షిప్త సందేశాల నుంచి వీడియో కాల్స్ వరకు ప్రతి ఒక్కరి మొదటి ఎంపిక వాట్సాప్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జోడిస్తున్న ఈ యాప్ యూజర్స్‌కి మరింత చేరువ అవుతోంది. ప్రస్తుతం దీనిపై బ్రెజిల్‌కు చెందిన హ్యాకర్స్ కన్ను పడిందని సమాచారం. టెక్ట్స్ బాంబ్‌గా పిలిచే స్కేరీ మెస్సేజెస్ ( Scarry Messages) వైరస్‌తో వాట్సాప్ నెట్‌వర్క్‌పై దాడి చేసినట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫో ( WABetaInfo) తెలిపింది. ఆగస్టు మధ్యలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు విస్తరించినట్లు వెల్లడించింది. కొద్ది రోజుల కిత్రం వాట్సాప్ ఐఓఎస్ , ఆండ్రాయిడ్ యాప్‌లలో ఎలాంటి కొత్త ఫీచర్స్ ఉండాలని కోరుకుంటున్నారో తెలియజేయమంటూ వాబీటా ఇన్ఫో యూజర్లను కోరింది. అందులో ఒకరు తనకు టెక్ట్స్ బాంబ్ సందేశాలు వస్తున్నాయని ట్వీట్ చేశారు. దీనిపై వాబీటాఇన్ఫో స్పందిస్తూ '' కొద్ది వారాల క్రితమే దీని గురించి మేం ప్రస్తావించాం. మా ఫాలోవర్స్‌లో కొంత మంది దీన్ని బినారియో , కాంటాక్ట్ బాంబ్స్ , ట్రావా జాప్ , క్రాషర్స్ , వికార్డ్ క్రాష్ , టెక్ట్స్ బాంబ్ '' అని పిలుస్తారని తెలిపింది. దీని...