Posts

Showing posts with the label work from home

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో కొత్త విధానం.. గూగుల్ ప్లాన్‌..

Image
కరోనా దెబ్బతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతే, కోట్లాది మంది ఉపాధిపై దెబ్బ పడింది. లాక్ డౌన్లు ముగిసి అన్‌లాక్‌లోకి అడుగుపెట్టి, అన్నింటికీ అనుమతులు ఇస్తున్నా, ఇంకా వ్యాపారాలు పూర్తిస్థాయిలో సాగడంలేదు. ఇక, ఈ సమయంలో చాలా సంస్థలు వర్క్‌ ఫ్రమ్ హోమ్‌కి మొగ్గు చూపాయి. కొన్ని సంస్థలు ఈ ఏడాది మొత్తం వర్క్‌ఫ్రమ్‌ హోం ప్రకటించాయి. మరోవైపు, గూగుల్ ఉద్యోగులు భవిష్యత్తులో హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ తరహాలో పనిచేయనున్నట్టు తెలిపారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. ఉద్యోగులకు ఆఫీసు సదుపాయాలు ఏర్పాటు చేయడం సహా దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే పలు అవకాశాలపై కసరత్తు చేస్తున్నట్టు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుందర్ పిచాయ్, తాము అంతర్గతంగా నిర్వహించిన ఓ సర్వేలో 62 శాతం మంది ఉద్యోగులు తిరిగి ఆఫీసుకు వచ్చి విధులు నిర్వహించడానికి మొగ్గు చూపుతున్నారని, కానీ, ప్రతిరోజూ వచ్చేందుకు మాత్రం ఇష్టంగా లేరని ఆ సర్వే నివేదిక చెబుతోందన్నారు. అయితు, భవిష్యత్తులో మరింత సులభతరమైన పని విధానాలు అందుబాటులో వస్తాయని భావిస్తున్నామన్న ఆయన, వ్యక్తిగతంగా లేదా గ్రూపుగా క్లిష్టమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు అందరి ప్రయోజన