గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపం, గవ్వలతో ఇలాచేస్తే…!
గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపం , గవ్వలతో ఇలాచేస్తే …! వివరణ: డా. యం.ఎన్. చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం. తార్నాక , హైదరాబాద్. ఫోన్: 9440611151 గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏవిధమైన ప్రాదాన్యత ఉందో గవ్వలకు అదేవిధమైన ప్రాధాన్యత ఉంది. గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు. కొన్ని దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణేలుగా చలామణి చేయటం ఇప్పటికీ అమలులో ఉంది. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు. గవ్వలు లక్ష్మీ దేవి చెల్లెల్లు అని , శంఖాలను లక్ష్మీదేవి సోదరులనీ భావిస్తుంటారు. గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబందం ఉంది. శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలు కూడ ఉంటాయి. శివుని జటాజూటంలోను , శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందంగా ఉంటాయి. గవ్వలు అలంకరణ వస్తువుగాను , ఆటవస్తువు...