5జీపై రూ 2.3 లక్షల కోట్ల పెట్టుబడులు...! | Rs 2.3 lakh crore investment on 5G
5 జీపై రూ 2.3 లక్షల కోట్ల పెట్టుబడులు ...! దేశవ్యాప్తంగా 5 జీ సేవలందించేందుకు స్పెక్ట్రం , సైట్లు , ఫైబర్ నెట్ వర్క్ పై టెలికం కంపెనీలు దాదాపు రూ . 1.3–2.3 లక్షల కోట్ల దాకా పెట్టుబడులు పెట్టాల్సి రావొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ( ఎంవోఎఫ్ ఎస్ ) ఒక నివేదికలో అంచనా వేసింది . ఒక్క ముంబై సర్కిల్ లోనే 5 జీ నెట్ వర్క్ పై రూ . 10,000 కోట్లు , ఢిల్లీలో రూ . 8,700 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందని పేర్కొంది . మధ్య లేదా కనిష్ట స్థాయి బ్యాండ్ స్పెక్ట్రం రిజర్వ్ ధర ప్రాతిపదికన ఎంవోఎఫ్ ఎస్ ఈ లెక్కలు వేసింది . టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రిజర్వ్ ధర ప్రకారం ముంబైలో 100 మెగాహెట్జ్ మిడ్ బ్యాండ్ స్పెక్ట్రం కోసం రిజర్వ్ ధర రూ . 8,400 కోట్లుగా ఉండనుంది . మరిన్ని కంపెనీలు తీవ్రంగా పోటీపడితే బిడ్డింగ్ ధర మరింతగా పెరగవచ్చు . కవరేజీ కోసం కనీసం 9,000 సైట్లు అవసరమయిన పక్షంలో వీటిపై సుమారు రూ . 1,800 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి రావొచ్చు . దీంతో ముంబైలో 5 జీ నెట్ వర్క్ పై వెచ్చించాల్సిన మొత్త...