Posts

Showing posts with the label pm

కార్ల్‌సన్‌ను ఓడించిన యువ సంచలనం ప్రజ్ఞానందకు ప్రధాని మోదీ అభినందనలు

Image
  కార్ల్‌సన్‌ను ఓడించిన యువ సంచలనం ప్రజ్ఞానందకు ప్రధాని మోదీ అభినందనలు ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్ చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన భారతదేశానికి చెందిన 16 ఏళ్ల కుర్రాడు ఆర్. ప్రజ్ఞానందను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ట్విట్టర్ వేదికగా ప్రజ్ఞానందకు మోదీ అభినందనలు తెలిపారు. "యువ మేధావి ఆర్ ప్రజ్ఞానంద విజయం పట్ల సంతోషిస్తున్నాను. ప్రముఖ చెస్‌ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌పై విజయం సాధించినందుకు గర్విస్తున్నాను. ప్రతిభావంతుడైన ప్రజ్ఞానందకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను." అని ప్రధాని నరేంద్ర మోదీ రాసుకొచ్చారు. కాగా ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ టోర్నీలోనే ఐదవ అతిపిన్న వయస్కుడైన 16 ఏళ్ల ప్రజ్ఞానానంద ఎనిమిదో రౌండ్‌లో ప్రపంచ చెస్ నంబర్ వన్‌ గ్రాండ్‌మాస్టర్ కార్ల్‌సన్‌ను ఓడించి ఆశ్చర్యపరిచాడు. అయితే వరల్డ్ నంబర్ వన్ కార్ల్‌సన్‌ను ఓడించినప్పటికీ ఈ టోర్నీలో ప్రజ్ఞానంద నాకౌట్ పోరుకు అర్హత సాధించలేకపోయాడు. ఈ ఆన్ ​ లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ​ ను 11వ స్థానంతో ముగించాడు. ఈ టోర్నీలో నాకౌట్‌కు అర్హత సాధించాలంటే తొల...