మార్కెట్ మళ్లీ లాభాల బాట...! #The market is on the path to profitability again
మార్కెట్ మళ్లీ లాభాల బాట ...! స్టాక్ మార్కెట్ మళ్లీ లాభాల పట్టాలెక్కింది . బ్యాంకింగ్ , ఫైనాన్స్ , ఎఫ్ ఎంసీజీ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో పాటు అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడం ఇందుకు కారణమైంది . సెన్సెక్స్ 449 పాయింట్లు పెరిగి .. తిరిగి 40 వేల పైన 40,432 వద్ద స్థిరపడింది . నిఫ్టీ 111 పాయింట్లను ఆర్జించి 11,873 వద్ద ముగిసింది . ఈ ఏడాది చివరికల్లా కోవిడ్ –19 వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి . పడిపోయిన క్రూడాయిల్ ధరలు కూడా మన మార్కెట్ కు కలిసొచ్చాయి . చిన్న , మధ్య తరహా షేర్ల కౌంటర్లలో కొనుగోళ్ల సందడి కనిపించింది . మరోవైపు అటో , ఐటీ , ఫార్మా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి . ఎఫ్ ఐఐలు రూ .1656.78 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా , డీఐఐలు రూ .1621.73 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు . ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్ , ఫైనాన్స్ , ఎఫ్ ఎంసీజీ షేర్లకు డిమాండ్ నెలకొనడం సూచీలకు కలిసొచ్చింది . ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోల్ ఇండియా , ఎ