Posts

Showing posts with the label gangavva

వెళ్లిపోతానంటున్న గంగవ్వ .. అసలేం జరిగింది

బిగ్ బాస్ షో అట్టహాసంగా పప్రారంభమైన విషయం తెలిసిందే . 16 మంది కంటెస్టెంట్స్ లో ఇప్పటికే సూర్యకిరణ్ ఎలిమినేటి అయిపోయాడు. సూర్యకిరణ్ ప్లేస్ లో "ఈ రోజుల్లో" ఫేమ్ సాయి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక బిగ్ బాస్ లో స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటే గంగవ్వ అని తడుముకోకుండా చెప్పొచ్చు. గంగవ్వ అమాయకత్వంతో , కమ్మనైన తెలంగాణ యాసతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యూట్యూబ్ స్టార్ అయిన గంగవ్వకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె వీడియోలకు మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయి. ఇక ఆమె బిగ్ బాస్ కు వెళ్లింది అంటే జనాలు మొత్తం ఆమె వెనుక ఉన్నారు. మొదటి వారంలోనే ఆమె ఎలిమినేషన్ కు నామినేట్ అవ్వడంతో భారీగా ఓట్లు పడ్డట్లుగా సమాచారం. ఇక నేడు విడుదల చేసిన ప్రోమోలో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఒక పడవను హోస్ లో ఉంచి. అందరు అందులోకి ఎక్కి ఆతరవాత ఆ పడవ తీరం చేరిన వెంటనే హారన్ వినిపిస్తుంది . అలా హారన్ వినిపించినప్పుడల్లా ఒకరు దిగిపోవాలని అన్నారు. అలా దిగిన వారు వచ్చే వారం ఎలిమినేషన్ కు నామినేట్ అవుతారని తెలిపాడు బిగ్ బాస్ . ఐతే పడవ దిగేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. గంగవ్వ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ...

'దేత్త‌డి' పంచ్ ఇచ్చిన‌ గంగ‌వ్వ...!

Image
'దేత్త‌డి' పంచ్ ఇచ్చిన‌ గంగ‌వ్వ ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు పెద్ద ఎన‌ర్జీగా ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. అన‌వ‌స‌ర‌మైన విష‌యాల‌కు రాద్ధాంతం చేయ‌డం, చిల్ల‌ర గొడ‌వ‌ల‌కు క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం ప్రేక్ష‌కుల‌కు చిరాకు పుట్టిస్తున్నాయి. అయితే ఉద‌యం మాత్రం దాదాపు అంద‌రూ కంటెస్టెంట్లు డ్యాన్సులు చేస్తున్నారు. ఫిట్‌నెస్ వీరులు ఎలాగో డ్యాన్స్ అవ‌గానే కాసేపు వ్యాయామం కూడా చేస్తున్నారు. అయితే  గంగ‌వ్వ  మాత్రం అటు డ్యాన్స్ చేస్తూ ఇటు డంబెల్స్ ఎత్తి ఎక్స‌ర్‌సైజ్ చేస్తూ రెండింటికి స‌మ‌న్యాయం చేస్తోంది. అవ్వ హుషారును చూసి కంటెస్టెంట్లే ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో కంటెస్టెంట్లు అంద‌రూ పాట‌కు త‌గ్గ‌ట్టు స్టెప్పులేశారు. ఆ త‌ర్వాత నోయ‌ల్, ముద్దు పెట్టే అని అవ్వ‌ను అడ‌గ్గానే గంగ‌వ్వ గాల్లో ముద్దులు పంపించింది. ఇక నీ ద‌గ్గ‌రున్న‌ చీర‌లు ఇచ్చేయ‌మంటున్నార‌ని దేత్త‌డి హారిక అవ్వ‌తో చెప్పింది. అందుకు అవ్వ‌ 'నేనెందుకు ఇస్తా?' అని రివ‌ర్స్ పంచ్ వేసింది. దీంతో అక్క‌డున్న లాస్య ప‌డీప‌డీ న‌వ్వింది. అయినా అవ్వ జోరును, హుషారును త‌ట్టుకోవ‌డం  బి...